పట్టాభి అరెస్ట్.. నా భర్తకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి పట్టాభి ఇంటి దగ్గర పోలీసులు హడావిడి చేస్తూనే ఉన్నారు. ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కాచుకుని ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పట్టాభి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నారు. బయట వ్యక్తులు లోపలకి రాకుండా ఉండేలా ఇంటి లోపల తాళం వేశారు. అయితే మధ్యాహ్నాం నుంచి భారీగా […]

Update: 2021-10-20 10:39 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి పట్టాభి ఇంటి దగ్గర పోలీసులు హడావిడి చేస్తూనే ఉన్నారు. ఏ క్షణమైనా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు కాచుకుని ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పట్టాభి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే ఉన్నారు. బయట వ్యక్తులు లోపలకి రాకుండా ఉండేలా ఇంటి లోపల తాళం వేశారు. అయితే మధ్యాహ్నాం నుంచి భారీగా పోలీసులు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చి వెళ్లిపోతామని పట్టాభిని పోలీసులు కోరారు. అయితే నోటీసులు తీసుకునేందుకు పట్టాభి ససేమిరా అన్నారు. అయితే రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు పట్టాభి ఇంటి గేట్లను విరగొట్టి లోపలకు వెళ్లారు. పట్టాభి ఉన్న గదిలోని తలుపులను సైతం పోలీసులు ధ్వంసం చేసి పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. పట్టాభిని సెక్షన్ 120బీ కింద పోలీసులు అరెస్ట్ చేశారు.

నాభర్తకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత

టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన సతీమణి సావిత్రి స్పందించారు. తన భర్తకు ఎలాంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. తన భర్తను వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆమె ఆరోపించారు. ఉదయం నుంచి తమ ఇంటి దగ్గర పోలీసులు మోహరించారని ఆమె ఆరోపించారు. తన ఇంటిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడితే విచారణ చేయాల్సిన పోలీసులు తన భర్తను అదుపులోకి తీసుకోవడం వెనుక కుట్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పడమట పీఎస్‌లో కేసు నమోదైందని, అందువల్లే విచారణకు తీసుకెళ్తున్నామని పోలీసులు తనకు చెప్పారని పట్టాభి సతీమణి సావిత్రి వెల్లడించారు.

Tags:    

Similar News