92 మంది రైతులు బలయ్యారు : లోకేశ్
దిశ, వెబ్‌డెస్క్ : అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఉద్యమం చేస్తున్న రైతులను వైసీపీ నేతలు తరచూ అవమానించడం వలన 92 మంది రైతులు బలయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం జగన్ రెడ్డి మనస్సు కరగడం లేదంటూ శనివారం ట్వీట్ చేశారు. జై అమరావతి ఉద్యమం 300రోజులకూ చేరుకుంటున్న సమయంలో ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరమన్నారు. కృష్ణాయపాలెం […]
దిశ, వెబ్‌డెస్క్ : అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఉద్యమం చేస్తున్న రైతులను వైసీపీ నేతలు తరచూ అవమానించడం వలన 92 మంది రైతులు బలయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. రాష్ట్రం కోసం భూమి త్యాగం చేసిన రైతుల గుండెలు ఆగిపోతున్నా సీఎం జగన్ రెడ్డి మనస్సు కరగడం లేదంటూ శనివారం ట్వీట్ చేశారు.
జై అమరావతి ఉద్యమం 300రోజులకూ చేరుకుంటున్న సమయంలో ఒకే రోజు ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరమన్నారు. కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన లంకా శివరామకృష్ణ, ఉద్దండ రాయుని పాలెంకు చెందిన పులి చిన్న లాజార్ మృతి పట్ల లోకేశ్ సంతాపం తెలిపారు. ఇకనైనా మూడు రాజధానుల మూర్ఖపు ఆలోచన మానుకుని, ఉన్న అమరావతిని అభివృద్ధి చేయాలని సూచించారు.