‘అబ్బాకొడుకులకు చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తా’
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తమ్మినేని సీతారాం ఓ సిగ్గుమాలిన వ్యక్తి అంటూ మండిపడ్డారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన టీడీపీ కుటుంబాలను ఆయన పరామర్శించారు. వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. గడచిన ఐదేళ్లలో ఆముదాలవలస నియోజకవర్గంలోని […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తమ్మినేని సీతారాం ఓ సిగ్గుమాలిన వ్యక్తి అంటూ మండిపడ్డారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన టీడీపీ కుటుంబాలను ఆయన పరామర్శించారు. వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. గడచిన ఐదేళ్లలో ఆముదాలవలస నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎలాంటి గొడవలు లేవన్నారు. అయితే తమ్మినేని సీతారాం గెలిచిన తర్వాత గొడవలు పెరిగాయని ఆరోపించారు. స్పీకర్ ఎవరిపై కేసులు పెట్టమంటే పోలీసులు వారిపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు స్పీకర్ తనయుడు సైతం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అబ్బాకొడుకులకు చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు. తమ్మినేని సీతారాం ఆయన కొడుకు ఒళ్లుదగ్గర పెట్టుకోవాలని కూన రవికుమార్ హెచ్చరించారు.