త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన టీసీఎస్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ సమగ్రమైన పోర్ట్‌ఫోలియో ద్వారా రెట్టింపు లాభాలను ప్రకటించి జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను టీసీఎస్ సంస్థ ప్రారంభించింది. ఈ త్రైమాసికంలో రూ. 9.624 కోట్ల నికర లాభాలతో 14.1 శాతం వృద్ధిని సాధించినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే, వార్షిక ప్రాతిపదికన రూ. 46,867 కోట్లతో కార్యకలాపాల ఆదాయం 16.8 […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. సామర్థ్యాన్ని బలోపేతం చేస్తూ సమగ్రమైన పోర్ట్‌ఫోలియో ద్వారా రెట్టింపు లాభాలను ప్రకటించి జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను టీసీఎస్ సంస్థ ప్రారంభించింది. ఈ త్రైమాసికంలో రూ. 9.624 కోట్ల నికర లాభాలతో 14.1 శాతం వృద్ధిని సాధించినట్టు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. అలాగే, వార్షిక ప్రాతిపదికన రూ. 46,867 కోట్లతో కార్యకలాపాల ఆదాయం 16.8 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది.
ఆర్డర్లు పెరగడం, దేశీయంగా వ్యాపారం కోలుకోవడం వంటి పరిణామాలతో కార్పొరేట్ కంపెనీలు డిజిటల్ విభాగంలో పెట్టుబడులను ఎక్కువగానే సాధిస్తున్నాయని టీసీఎస్ అభిప్రాయపడింది. ‘అరుదైన అవకాశాలను అందిపుచ్చుకుంటూ, మెరుగైన సేవలను వినియోగదారులకు అందిస్తూ వృద్ధిని సాధిస్తున్నామని’ టీసీఎస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ అన్నారు. టీసీ కంపెనీ బోర్డు సంస్థ షేర్ హోల్డర్ కోసం రూ. 7 మధ్యంతర డివిడెండ్‌కు ఆమోదించింది. అలాగే, టీసీఎస్ బోర్డు సమావేశంలో సంస్థ ఎండీ, సీఈఓగా గోపీనాథన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించేందుకు ఆమోదం తెలిపింది.