ఎస్‌పీ గ్రూప్ వాటా కొనేందుకు టాటా సన్స్

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీలోని షాపూర్‌జీ పల్లోంజి గ్రూపు(ఎస్‌పీ గ్రూప్)నకు చెందిన 18.4 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ సిద్ధమవుతోంది. దీనికోసం సుమారు రూ. 21,900 కోట్లను ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. అక్టోబర్ 28న సుప్రీంకోర్టు ప్రతిపాదనకు టాటా గ్రూప్ నివేదిక అందించనుంది. మిస్త్రీ గ్రూపునకు చెందిన ఎస్‌పీ గ్రూప్, టాటా గ్రూప్ మధ్య గత కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌పీ గ్రూపు వాటాను కొనుగోలు చేసేందుకు అవసరమైన […]

Update: 2020-10-09 09:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీలోని షాపూర్‌జీ పల్లోంజి గ్రూపు(ఎస్‌పీ గ్రూప్)నకు చెందిన 18.4 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు టాటా సన్స్ సిద్ధమవుతోంది. దీనికోసం సుమారు రూ. 21,900 కోట్లను ఆఫర్ చేసే అవకాశాలున్నాయి. అక్టోబర్ 28న సుప్రీంకోర్టు ప్రతిపాదనకు టాటా గ్రూప్ నివేదిక అందించనుంది. మిస్త్రీ గ్రూపునకు చెందిన ఎస్‌పీ గ్రూప్, టాటా గ్రూప్ మధ్య గత కొన్నాళ్లుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌పీ గ్రూపు వాటాను కొనుగోలు చేసేందుకు అవసరమైన విధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే గ్రూపునకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సమకూర్చనుంది.

టీసీఎస్‌లో మాతృసంస్థ టాటా గ్రూపునకు 72 శాతం వాటా ఉంది. ఇటీవల షేర్‌ల బైబ్యాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ. 21 వేల కోట్లకు గానూ షేర్‌ల బైబ్యాక్ ద్వారా రూ. 11 వేల కోట్లకు పైగా అంచనా వేస్తోంది. బిబ్యాక్ ద్వారా వీలు కాకపోతే టీసీఎస్‌లో ఎక్కువ వాటాను విక్రయించాలిస్ ఉంటుందని తెలుస్తోంది. టీసీఎస్ నుంచి వచ్చే నిధులు మిస్త్రీ వాటాలో కొంత భాగాన్ని కొనుగోలు చేయడానికి ఉపయోగపడతాయని కంపెనీ భావిస్తోంది. ఇదే సమయంలో టాటా సన్స్ బయటి పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది. రెండు మూడు వారాల్లో స్పష్టత వస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

వాటాను కొనుగోలు చేయడంలో పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, టాటా సన్స్‌కు పొటెన్షియల్ ఇన్వెస్టర్లు కీలకమని తెలుస్తోంది. మరోవైపు మిస్త్రీ కుటుంబం వాటాను కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతోంది. అయితే, విలువ దగ్గర సంక్లిష్టత ఏర్పడవచ్చని, బాండ్స్ చెల్లింపులకు అవసరమైన నిధులను సమీకరించాలని ఎస్‌పీ గ్రూప్ భావిస్తే..ఆ గ్రూపునకు ఉన్న 18.4 శాతం వాటాను కొనుగోలు చేస్తామని సుప్రీంకోర్టుకు టాటాసన్స్ తరపున న్యాయవాది ఇటీవల స్పష్టం చేశారు.

ఒకవేళ ఎస్‌పీ గ్రూప్ షేర్ల ద్వారా నిధులను సమీకరించాలని భావిస్తే ఆ షేర్లు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని టాటా గ్రూప్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 28 వరకూ ఎస్‌పీ గ్రూప్, సైరస్ మిస్త్రీ, ఆయన పెట్టుబడి సంస్థలు టాటా సన్స్ షేర్‌లను తాకట్టు పెట్టడమో లేదంటే బదిలీనో చేయకూడదని సుప్రీంకోర్టు సంస్థలను సూచించింది.

Tags:    

Similar News