ప్యాసింజర్ వాహనాల ధరలు పెంచిన టాటా మోటార్స్
దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతున్న ఇన్‌పుట్, వస్తువుల వ్యయాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మే 8 నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎంపిక మోడల్, వేరియంట్‌ని బట్టి ప్యాసింజర్ వాహనాల ధరల పెరుగుదల సగటున 1.8 శాతం పెరుగుదల ఉంటుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మే 7వ తేదీలోపు వాహనాలను బుక్ చేసుకున్న వినియోగదారులకు ఈ పెరుగుదల వర్తించదన్ని కంపెనీ వెల్లడించింది. ‘ఉక్కు, విలువైన మెటల్స్ […]
దిశ, వెబ్‌డెస్క్: పెరుగుతున్న ఇన్‌పుట్, వస్తువుల వ్యయాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మే 8 నుంచి వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎంపిక మోడల్, వేరియంట్‌ని బట్టి ప్యాసింజర్ వాహనాల ధరల పెరుగుదల సగటున 1.8 శాతం పెరుగుదల ఉంటుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. మే 7వ తేదీలోపు వాహనాలను బుక్ చేసుకున్న వినియోగదారులకు ఈ పెరుగుదల వర్తించదన్ని కంపెనీ వెల్లడించింది. ‘ఉక్కు, విలువైన మెటల్స్ వంటి పరికరాల ధరలు పెరగడం వల్ల తమ వాహనాల ధరలను పెంచక తప్పడంలేదని’ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగం ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర చెప్పారు. ఇప్పటికే కార్లను బుక్ చేసుకున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని మే 7 లోగా బుకింగ్ చేసుకున్న వాటికి ధరల పెరుగుదల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు కంపెనీ వివరించింది.