టాటా సఫారీ-2021 లాంచ్.. న్యూ జనరేషన్ నుంచి గుడ్ రెస్పాన్స్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన సంస్థ టాటా మోటార్స్ తన సరికొత్త టాటా సఫారీ కారును సోమవారం మార్కెట్లో ఆవిష్కరించింది. మొత్తం 6 వేరియంట్లలో ఈ కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్నట్టు వెల్లడించిన కంపెనీ, ప్రారంభ ధర రూ. 14.69 లక్షలుగా ఉండనున్నట్టు తెలిపింది. ఇందులో టాప్ మోడల్ ధర రూ. 21.45 లక్షలని కంపెనీ పేర్కొంది. ఇవి కాకుండా, అడ్వెంచర్ పర్సొనా పేరున కొత్త వేరియంట్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. దీని ధరను రూ. […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన సంస్థ టాటా మోటార్స్ తన సరికొత్త టాటా సఫారీ కారును సోమవారం మార్కెట్లో ఆవిష్కరించింది. మొత్తం 6 వేరియంట్లలో ఈ కొత్త ఎస్‌యూవీని తీసుకొస్తున్నట్టు వెల్లడించిన కంపెనీ, ప్రారంభ ధర రూ. 14.69 లక్షలుగా ఉండనున్నట్టు తెలిపింది. ఇందులో టాప్ మోడల్ ధర రూ. 21.45 లక్షలని కంపెనీ పేర్కొంది. ఇవి కాకుండా, అడ్వెంచర్ పర్సొనా పేరున కొత్త వేరియంట్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. దీని ధరను రూ. 20.20 లక్షలుగా నిర్ణయించింది. అదేవిధంగా గ్రావిటాస్ కాన్సెప్ట్‌తో కొత్త సఫారీలను విడుదల చేయనున్నట్టు కంపెనె ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
ఎక్స్ఈ, ఎఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌టీ ప్లస్, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్ ప్లస్ మోడళ్లలో లభించే టాటా సఫారీ-2021 కోసం ఇప్పటికే బుకింగ్ ప్రారంభమైందని, డీలర్‌షిప్‌ల వద్ద రూ. 30 వేలను చెల్లించి ఈ సరికొత్త ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ‘సఫారీ మోడల్ దేశీయంగా ఎస్‌యూవీ స్టైల్‌ను పరిచయం చేసింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కొత్త వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ సరికొత్త సఫారీ-2021 ఎస్‌యూవీ కొత్త జనరేషన్ కస్టమర్లను ఆకట్టుకుంది. ఖరీదైన ఇంటీరియర్, అత్యాధునిక కనెక్టివిటీ, ప్రీమియం స్టైల్‌తో లభిస్తుందని’ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర చెప్పారు.