మళ్లీ మార్కెట్లోకి రానున్న టాటా సఫారీ

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మొట్టమొదటి ఎస్‌యూవీలలో ఒకటైన ఐకానిక్ సఫారి బ్రాండ్‌ను సరికొత్తగా మళ్లీ మార్కెట్లోకి తీసుకురావాలని టాటా మోటార్స్ భావిస్తోంది. గతేడాది ఈ మోడల్ ఉత్పత్తిని ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కొత్త సఫారీ మోడల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి గ్రావిటాస్ పేరున టాటా సఫారీ ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించనున్నట్టు పేర్కొంది. ఈ సరికొత్త సఫారీ ఈ నెలలోనే అందుబాటులోకి వస్తాయని, కొద్దిరోజుల్లో సఫారీ వాహన బుకింగ్‌లను ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది. […]

Update: 2021-01-06 09:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మొట్టమొదటి ఎస్‌యూవీలలో ఒకటైన ఐకానిక్ సఫారి బ్రాండ్‌ను సరికొత్తగా మళ్లీ మార్కెట్లోకి తీసుకురావాలని టాటా మోటార్స్ భావిస్తోంది. గతేడాది ఈ మోడల్ ఉత్పత్తిని ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కొత్త సఫారీ మోడల్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి గ్రావిటాస్ పేరున టాటా సఫారీ ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించనున్నట్టు పేర్కొంది. ఈ సరికొత్త సఫారీ ఈ నెలలోనే అందుబాటులోకి వస్తాయని, కొద్దిరోజుల్లో సఫారీ వాహన బుకింగ్‌లను ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది. ‘దేశీయ మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన సఫారీనికి తిరిగి మార్కెట్లోకి తీసుకురావడం పట్ల సంతోషంగా ఉంది. దశాబ్దాలుగా సఫారీ అభిమానులను సాధించిన ఈ ఐకానిక్ బ్రాండ్ కొత్త డిజైన్, ఫీచర్లతో పాటు గతంలో ఇచ్చిన వినియోగదారుల సంతృప్తిని అందిస్తుంది. కొత్త మోడల్ మార్కెట్లో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని’ టాటా ప్యాసింజర్ వాహన విభాగం ప్రెసిడెంట్ శైలెష్ చంద్ర తెలిపారు.

Tags:    

Similar News