భారీగా రేషన్ బియ్యం పట్టివేత

దిశ, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మందాపుర్ గ్రామంలో నిర్మాణం జరుగుతున్న రైస్ మిల్లులో రూ.1500 వందల బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.11 లక్షల వరకూ ఉంటుందని అధికారులు రేవతి, వేణు మధన్ తెలిపారు. పాన్‌గల్ పోలీసుల సమాచారం ప్రకారం.. అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉన్నాయన్న సమాచారం మేరకు మందపూర్ సివిల్ సప్లయ్ అధికారులు పరమేశ్వర రైస్ మిల్లులో దాడులు నిర్వహించారు. మిల్లు వద్ద […]

Update: 2020-06-26 09:08 GMT

దిశ, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మందాపుర్ గ్రామంలో నిర్మాణం జరుగుతున్న రైస్ మిల్లులో రూ.1500 వందల బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.11 లక్షల వరకూ ఉంటుందని అధికారులు రేవతి, వేణు మధన్ తెలిపారు. పాన్‌గల్ పోలీసుల సమాచారం ప్రకారం.. అక్రమంగా రేషన్ బియ్యం నిలువ ఉన్నాయన్న సమాచారం మేరకు మందపూర్ సివిల్ సప్లయ్ అధికారులు పరమేశ్వర రైస్ మిల్లులో దాడులు నిర్వహించారు. మిల్లు వద్ద రెండు వాహనాల్లో రేషన్ బియ్యం బస్తాలు, డంపు చేసిన బియ్యన్ని స్వాదీనం చేసుకున్నారు. అనంతరం వాటిని మదనాపురంలోని ధరణి ట్రేడర్స్‌లో నిల్వ వుంచినట్టు సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ ఎస్పీ(ఓఎస్డీ) ద్రోణాచార్యులు, సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వాహనాలను సీజ్ చేసి, రైస్ మిల్లు యాజమాని పరమేశ్వర్ రెడ్డి‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Tags:    

Similar News