Jr NTR: తాతా.. తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది : తారక్
దిశ, సినిమా : వెండితెరపై రాముడిగా, కృష్ణుడిగా తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి నేడు (Nandamuri Taraka RamaRao). ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో మకుటం లేని రారాజుగా వెలుగొంది, ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం (Telugudesam ) పార్టీని స్థాపించి ప్రజారంజక పాలనతో దేశ రాజకీయాల్లోనూ ముద్ర వేసిన ఎన్టీఆర్‌కు ‘భారత రత్న’ […]
దిశ, సినిమా : వెండితెరపై రాముడిగా, కృష్ణుడిగా తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి నేడు (Nandamuri Taraka RamaRao). ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. తెలుగు సినీ చరిత్రలో మకుటం లేని రారాజుగా వెలుగొంది, ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం (Telugudesam ) పార్టీని స్థాపించి ప్రజారంజక పాలనతో దేశ రాజకీయాల్లోనూ ముద్ర వేసిన ఎన్టీఆర్‌కు ‘భారత రత్న’ ఇవ్వాలని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఆకాంక్షించారు. మరోవైపు ఎన్టీఆర్ చిన్న కుమారుడు బాలకృష్ణ స్వయంగా ఆలపించిన రామదండకాన్ని రిలీజ్ చేయగా.. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ట్విట్టర్‌లో స్పెషల్ మెసేజ్ పోస్టు చేశాడు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపం కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ అంటూ తాతపై తన ప్రేమను చాటుకున్నాడు.
మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా 🙏🏻 pic.twitter.com/a3wAJeN6XR
— Jr NTR (@tarak9999) May 28, 2021