13 ఏళ్ల తర్వాత విజేత తమిళనాడు
దిశ, స్పోర్ట్స్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి సీజన్ విజేత తమిళనాడు.. మరోసారి ఆ కప్ గెలవడానికి 13 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. గతేడాది ఫైనల్స్ చేరినా కర్నాటక చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరిన కార్తిక్ నేతృత్వంలోని తమిళనాడు జట్టు, అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని చెలాయించి బరోడాపై ఘన విజయం సాధించింది. రెండుసార్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన బరోడా, కర్నాటకల సరసన తమిళనాడు నిలిచింది. అహ్మదాబాద్‌లోని సర్ధార్ పటేల్ […]
దిశ, స్పోర్ట్స్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తొలి సీజన్ విజేత తమిళనాడు.. మరోసారి ఆ కప్ గెలవడానికి 13 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. గతేడాది ఫైనల్స్ చేరినా కర్నాటక చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండోసారి ఫైనల్స్ చేరిన కార్తిక్ నేతృత్వంలోని తమిళనాడు జట్టు, అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని చెలాయించి బరోడాపై ఘన విజయం సాధించింది. రెండుసార్లు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచిన బరోడా, కర్నాటకల సరసన తమిళనాడు నిలిచింది.
అహ్మదాబాద్‌లోని సర్ధార్ పటేల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి బరోడాతో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో తమిళనాడు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. బరోడా నిర్దేశించిన 121 పరుగుల విజయలక్ష్యంలో బరిలోకి దిగిన తమిళనాడు ఓపెనర్లు శుభారంభం అందించలేదు. ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ నారాయన్ జగదీష్ (14) త్వరగా అవుటయ్యాడు. మేరీవాలా బౌలింగ్‌లో కకాడేకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. మరో ఓపెనర్ హరి నిషాంత్, బాబా అపరాజిత్ కలిసి తమిళనాడు ఇన్నింగ్స్ నిర్మించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ వికెట్ పడకుండా స్కోర్ పెంచారు.
రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని బాబాషఫీ పఠాన్ విడదీశాడు. 12వ ఓవర్ వేసిన బాబాషఫీ పఠాన్ బౌలింగ్‌లో హరి నిషాంత్ (35) భట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ దినేశ్ కార్తిక్ (22) దూకుడుగా ఆడాడు. బౌండరీలతోపాటు సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు వేగం పెంచాడు. బాబా అపరాజిత్‌తో కలిసి 34 పరుగులు జోడించాడు. మరింత దూకుడుగా ఆడే క్రమంలో అతిత్ సేథ్ బౌలింగ్‌లో సోలంకికి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. అయితే, బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన హార్డ్ హిట్టర్ షారుక్ ఖాన్ చెలరేగిపోయాడు. బాబా అపరాజిత్ (29) కంటే షారుక్ స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకున్నాడు. కేవలం 7 బంతుల్లో 18 పరుగులు కొట్టి తమిళనాడును విజయతీరాలకు చేర్చాడు. బరోడా నిర్దేశించిన లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి మరో 2 ఓవర్లు మిగిలి ఉండానే తమిళనాడు ఛేదించింది. తమిళనాడు జట్టు 18 ఓవర్లలో 123 పరుగులు చేసింది. బరోడాను కుప్పకూల్చిన మనిమారన్ సిద్దార్థ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఆదుకున్న సోలంకి
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బరోడా జట్టును తమిళనాడు బౌలర్ సిద్దార్థ్ గడగడలాడించాడు. బరోడా ఓపెనర్లు కేదార్ దేవ్‌ధర్, నినాద్ రాథ్వా శుభారంభాన్ని అందించలేదు. రెండో ఓవర్ తొలి బంతికే నినాద్ రాథ్వా (1) అపరాజిత్ బౌలింగ్‌లో అరుణ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. వరుస బౌండరీలతో చెలరేగుతున్న కెప్టెన్ కేదార్ దేవ్‌ధర్ (16) సిద్దార్థ్ బౌలింగ్‌లో జగదీషన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత ఏ బ్యాట్స్‌మెన్ కూడా క్రీజులో కుదురుకోలేదు. సిద్దార్థ్ బౌలింగ్ ధాటికి వరుసగా ఒకరి తర్వాత ఒకరు పెవీలియన్ చేరారు. స్మిత్ పటేల్ (1) సిద్దార్థ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. భాను పునియా (0) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరగగా, అభిమన్యు సింగ్ (2) సిద్దార్థ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న కార్తిక్ కకాడే (4)నూ సిద్దార్థే క్లీన్ బౌల్డ్ చేశాడు.
దీంతో కేవలం 14 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి బరోడా పీకల్లోతు కష్టాల్లో పడింది. 36 పరుగులకే 6 వికెట్లు నష్టపోయిన బరోడా జట్టు కనీసం 50 పరుగులైనా చేస్తుందా అనుకున్న సమయంలో విష్ణు సోలంకి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సోలంకి వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో పాతుకొని పోయాడు. అతిత్ సేథ్ (29), సోలంకి (49) కలిసి 7వ వికెట్‌కు 58 పరుగులు జోడించారు. సోనూ యాదవ్ బౌలింగ్‌లో అతిత్ సేథ్.. అరుణ్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన భార్గవ్ భట్ (12 నాటౌట్)తో కలిసి విష్ణు సోలంకి బౌండరీలు బాదుతూ స్కోర్ వేగం పెంచాడు. చివరి ఓవర్లో సోలంకి రనౌట్ అయి పెవీలియన్ చేరాడు. సోలంకి ఆదుకోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో బరోడా జట్టు 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. మనియారన్ సిద్దార్థ్ 4 వికెట్లు తీయగా, బాబా అపరాజిత్, సోనూ యాదవ్, మహమ్మద్ తలా ఒక వికెట్ తీశారు.
స్కోర్ బోర్డు:
బరోడా
కేదార్ దేవధర్ (సి) జగదీషన్ (బి) సిద్దార్థ్ 16, నినాద్ రాథ్వా (సి) అరుణ్ కార్తీక్ (బి) బాబా అపరాజిత్ 1, విష్ణు సోలంకి (రనౌట్) 49, స్మిత్ పటేల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిద్దార్థ్ 1, భాను పనియా (రనౌట్) 0, అభిమన్యుసింగ్ రాజ్‌పుత్ (సి) అండ్ (బి) 2, కార్తిక్ కకాడే (బి) సిద్దార్థ్ 4, అతిత్ సేథ్ (సి) అరుణ్ కార్తీక్ (బి) సోనూ యాదవ్ 29, భార్గవ్ భట్ 12 నాటౌట్, బాబాషఫీ పఠాన్ (సి) కార్తీక్ (బి) మహమ్మద్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లు) 120/9
వికెట్ల పతనం : 1-6, 2-22, 3-28, 4-28, 5-32, 6-36, 7-94, 8-120, 9-120
బౌలింగ్: సాయి కిషోర్ (4-1-11-0), బాబా అపరాజిత్ (3-0-16-1), మనిమారన్ సిద్దార్థ్ (4-0-20-4), మురుగన్ అశ్విన్ (4-0-27-0), సోనూ యాదవ్ (3-0-29-1), మహమ్మద్ (2-0-16-1)
తమిళనాడు
హరి నిషాంత్ (సి) భట్ (బి) పఠాన్ 35, నారాయన్ జగదీషన్ (సి) కకాడే (బి) మేరీవాలా 14, బాబా అపరాజిత్ 29 నాటౌట్, దినేష్ కార్తిక్ (సి) సోలంకి (బి) సేథ్ 22, షారుక్ ఖాన్ 18 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18 ఓవర్లు) 123/3
వికెట్ల పతనం : 1-26, 2-67, 3-101
బౌలింగ్: అతిత్ సేథ్ (3-0-20-1), లుక్మన్ మేరీవాలా (4-0-34-1), భార్గవ్ భట్ (4-0-25-0), కార్తిక్ కకాడే (2-0-12-0), బాబాషఫీ పఠాన్ (4-0-23-1), నినాద్ రాథ్వా (1-0-8-0)