చెత్త ఏరుకునే వ్యక్తి.. ఐదడుగుల విగ్రహమై నిలిచాడు
దిశ, వెబ్‌డెస్క్: లక్ష్యం.. ఎప్పుడు కూడా మన శక్తికి మించినదై, సాధించడానికి సవాల్ విసిరేలా ఉండాలి. మనం సాధిస్తామనంటే.. అందరూ అతడికి సాధ్యమవుతుందా? ‘నో.. నో.. నెవ్వర్’ అని చెప్పుకునేలా ఉండాలి. అప్పుడే ఆ లక్ష్యాన్ని సాధించాలనే కసి పుడుతుంది. అలాంటి లక్ష్యంతో పాటు మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. నువ్వు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధిస్తే.. గుర్తింపు కూడా దానంతట అదే వస్తుంది. అలా వీధుల్లో చెత్త ఏరుకునే ఓ వ్యక్తి.. […]
దిశ, వెబ్‌డెస్క్: లక్ష్యం.. ఎప్పుడు కూడా మన శక్తికి మించినదై, సాధించడానికి సవాల్ విసిరేలా ఉండాలి. మనం సాధిస్తామనంటే.. అందరూ అతడికి సాధ్యమవుతుందా? ‘నో.. నో.. నెవ్వర్’ అని చెప్పుకునేలా ఉండాలి. అప్పుడే ఆ లక్ష్యాన్ని సాధించాలనే కసి పుడుతుంది. అలాంటి లక్ష్యంతో పాటు మనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. నువ్వు ఎంచుకున్న లక్ష్యాన్ని సాధిస్తే.. గుర్తింపు కూడా దానంతట అదే వస్తుంది. అలా వీధుల్లో చెత్త ఏరుకునే ఓ వ్యక్తి.. లక్ష్యం దిశగా ప్రయాణించి, నిలువెత్తు విగ్రహంగా.. నిండైన ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలిచాడు. గొప్ప పేరు తెచ్చుకోవాలనే జీవితాశయం కోసం 20 ఏళ్లుగా నిరంతరం కష్టపడిన తను.. నేడు సాధించి ‘ఔరా’ అనిపిస్తున్నాడు.
తమిళనాడులోని సేలం జిల్లా, అనైమేదు గ్రామానికి చెందిన నల్లతంబి.. తన సమాజంలో గుర్తింపు పొందాలనే తన లక్ష్యం కోసం జీవితాంతం డబ్బుల్ని పోగు చేశాడు. గతంలో తను ఇటుకల బట్టీలో పనిచేసే రోజుల నుంచి నేడు వీధుల్లో చెత్త ఏరుకునే వరకు.. అతడి జర్నీలో ఎలాంటి ట్విస్టులు లేవు. కానీ 20 ఏళ్లుగా.. తన విగ్రహం నిర్మించుకోవాలనే ఆశతో ముందుకు సాగాడు. 20 ఏళ్ల క్రితమే భార్యాపిల్లలను, ఉన్న ఊరిని వదిలేసి వచ్చాడు. కానీ అతడి ఆశయాన్ని మాత్రం వదిలేయలేదు. అతడు కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి కూడా జీవితంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని కలలు కన్నాడు. అందుకే రూపాయి రూపాయి పొదుపు చేశాడు. దానికి సమాధానమే.. సొంత స్థలంలో 5 అడుగులతో నిర్మించుకున్న అతడి విగ్రహం.
20 ఏళ్లుగా.. వీధుల్లో బాటిల్స్ ఏరుకుంటూ, వాటిని అమ్మగా వచ్చిన డబ్బుల్ని జమ చేసి పది లక్షలు సంపాదించాడు. వాటితో వగపడి-బెలూర్ రోడ్డులో 2400 చదరపు అడుగుల స్థలం కొన్నాడు. ఆ స్థలంలోనే ఓ శిల్పితో తన 5 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పాడు. అతడి విగ్రహాన్ని మలిచిన శిల్పికి లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు వగపడి – బెలూరు నల్లతంబి విగ్రహం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ విగ్రహం ఓ చెత్త ఏరుకునే వ్యక్తిది అని తెలియడంతో.. ప్రజలు నల్లతంబి విగ్రహాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘నేను కుర్రాడిగా ఉన్నప్పటి నుంచి గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకునేవాడిని. అందుకే నాకంటూ ఓ విగ్రహం ఉండాలనుకున్నా. నేను నా కలను సాకారం చేసుకున్నా’ అని ఆనందం వ్యక్తం చేశాడు నల్ల తంబి.
గొప్ప వక్త లేదా మహా మహా పండితుడు.. మనల్ని మోటివేట్ చేయాల్సిన పనిలేదు. మనం పెట్టుకున్న లక్ష్యమే.. మనల్ని మోటివేట్ చేసేలా ఉండాలి. ఒకరు ఇచ్చిన మోటివేషన్.. రెండు మూడు రోజులు మాత్రమే ఉంటుంది. కానీ సెల్ఫ్ మోటివేషన్.. నిత్యం మనలో అగ్గి రాజేస్తుంది.