రాష్ట్రానికి తమిళ ప్రభుత్వం భారీ విరాళం….

దిశ, వెబ్ డెస్క్ : వరద బాధితులకు అండగా నిలిచేందుకు తమిళ నాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం రూ. 10కోట్ల విరాళాన్ని తమిళనాడు సీఎం పళనీ స్వామి ప్రకటించారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సీఎం పళనీ స్వామికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలను తెలిపారు. కాగా వరదల నేపథ్యంలో తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ. 1350 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం […]

Update: 2020-10-19 06:27 GMT

దిశ, వెబ్ డెస్క్ : వరద బాధితులకు అండగా నిలిచేందుకు తమిళ నాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ వరద బాధితుల సహాయార్థం రూ. 10కోట్ల విరాళాన్ని తమిళనాడు సీఎం పళనీ స్వామి ప్రకటించారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సీఎం పళనీ స్వామికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలను తెలిపారు. కాగా వరదల నేపథ్యంలో తక్షణ సాయంగా రాష్ట్రానికి రూ. 1350 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ కోరారని ఆయన తెలిపారు. కానీ ఇంత వరకు దీనిపై కేంద్రం ప్రభుత్వం స్పందించలేదనీ తెలిపారు. త్వరలోనే స్పందిస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో నాయకులు , స్వచ్చంద సంస్థలు పాల్గోవాలని ఆయన కోరారు.

Tags:    

Similar News