నగ్నంగా నామినేషన్లు వేస్తాం.. ఎలాగైనా గెలిచి చూపిస్తాం
దిశ,వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకొని 20 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటీకే పలువురు నామినేషన్లను కూడా దాఖలు చేసారు. ఇకపోతే కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా తమిళనాడు రైతులు సైతం కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు లో […]
దిశ,వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకొని 20 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటీకే పలువురు నామినేషన్లను కూడా దాఖలు చేసారు. ఇకపోతే కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా తమిళనాడు రైతులు సైతం కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
ఈ నేపథ్యంలోనే తమిళనాడు లో బీజేపీ అభ్యర్థులు ఎక్కడ ఐతే పోటీచేస్తున్నారో, అక్కడ తాము కూడా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. నామినేషన్లు వేసేటప్పుడు నగ్నంగా వెళ్లి తమ నిరసన తెలుపుతామని బీజేపీ కి వార్నింగ్ ఇచ్చారు. రైతుల వేదన బీజేపీ నేతలకు వినపడడం లేదా? అయితే తాము కూడా ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ ని ఓడించి తీరతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.