తమిళనాడులో లాక్‌డౌన్ పొడిగింపు.. సడలింపులో ఇవి ఓపెన్

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా పాజిటివ్ కేసులు ఇంకా నమోదు అవుతున్న కారణంగా రాష్ట్రంలో ఈనెల 21 వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, లాక్‌డౌన్ సమయంలో ఆంక్షలను సడలించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాలను రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అనుమతిస్తున్నట్టు […]

Update: 2021-06-11 12:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా పాజిటివ్ కేసులు ఇంకా నమోదు అవుతున్న కారణంగా రాష్ట్రంలో ఈనెల 21 వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, లాక్‌డౌన్ సమయంలో ఆంక్షలను సడలించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాలను రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అనుమతిస్తున్నట్టు తెలిపారు.

కోయంబత్తూరు, నీలగిరితో సహా 11 జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ స్టోర్లు, కూరగాయల దుకాణాలు, మాంసం, చేపల దుకాణాలకు అనుమతిస్తున్నారు. సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను ఏసీలు లేకుండా 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటలకు వరకూ ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.

 

Tags:    

Similar News