కరోనా వ్యాక్సినేషన్ వికటించే వివేక్ చనిపోయాడు- ప్రముఖ నటుడు

దిశ, వెబ్ డెస్క్: తమిళ ప్రముఖ నటుడు వివేక్ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఈ ఘటన యావత్తు సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ వివేక్ మృతికి ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ మృతదేహాన్ని చెన్నైలోని ఆయన స్వగృహానికి తరలించారు.ఆయన ను చివరి చూపు చూడడానికి ప్రముఖులు తరలివస్తున్నారు. అయితే ప్రస్తుతం వివేక్ మరణం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివేక్ మరణానికి […]

Update: 2021-04-17 01:56 GMT

దిశ, వెబ్ డెస్క్: తమిళ ప్రముఖ నటుడు వివేక్ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన ఈ ఘటన యావత్తు సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ వివేక్ మృతికి ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో వివేక్ మృతదేహాన్ని చెన్నైలోని ఆయన స్వగృహానికి తరలించారు.ఆయన ను చివరి చూపు చూడడానికి ప్రముఖులు తరలివస్తున్నారు. అయితే ప్రస్తుతం వివేక్ మరణం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివేక్ మరణానికి కరోనా వ్యాక్సినేషన్ వికటించడమే కారణమని తమిళ నటుడు, రాజకీయ నేత మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

గుండెనొప్పి ఉన్నవారికి కరోనా వ్యాక్సినేషన్ వేయకూడదని, అయినా వివేక్ ఇటీవలే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వికటించడం వలనే వివేక్ మృతి చెందినట్లు మన్సూర్ ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాకా, గుండె ఆపరేషన్ డాక్టర్లు ఎలా చేస్తారని? ఆయన ప్రశ్నించారు. వివేక్ కి చికిత్స చేసిన వైద్యులు సైతం ఆయన తీసుకున్న కరోనా వ్యాక్సినేషన్ కి ఈ మరణానికి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇవ్వడం ఆసక్తికర డిబేట్ కి తెర తీసింది. ఈ వ్యాఖ్యలతో వివేక్ మరణం పై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం మన్సూర్ అలీఖాన్ వ్యతిరేక ఆరోపణలు సోషల్ మీడియాల్లోనూ తీవ్రమైన డిబేట్ కి తెర తీస్తున్నాయి.

Tags:    

Similar News