కోహ్లీకి తమన్నాతో అక్కడేం పని.. అనుమానం నిజమేనా?

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్ వైరల్ అయింది. ప్రైవేట్ జెట్‌లో కూర్చున్న తమన్నా చేతిలో ఉన్న ట్రే నిండా కుకీస్, చిప్స్ ఉండగా.. వెనకాల కూర్చున్న మేకప్ ఆర్టిస్ట్స్ ఫ్లోరియన్ హురెల్, నీలమ్ కెనియా ఎప్పుడెప్పుడు తినేద్దామా! అన్నట్లుగా వాటిపైనే కాన్సంట్రేట్ చేసిన పిక్ షేర్ చేసింది. ‘బ్రేక్ ఫాస్ట్ ప్లీజ్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన పిక్చర్‌లో ఉన్న ఫ్లోరియన్.. క్రికెటర్ విరాట్ కోహ్లీ […]

Update: 2021-04-10 02:05 GMT

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్ వైరల్ అయింది. ప్రైవేట్ జెట్‌లో కూర్చున్న తమన్నా చేతిలో ఉన్న ట్రే నిండా కుకీస్, చిప్స్ ఉండగా.. వెనకాల కూర్చున్న మేకప్ ఆర్టిస్ట్స్ ఫ్లోరియన్ హురెల్, నీలమ్ కెనియా ఎప్పుడెప్పుడు తినేద్దామా! అన్నట్లుగా వాటిపైనే కాన్సంట్రేట్ చేసిన పిక్ షేర్ చేసింది. ‘బ్రేక్ ఫాస్ట్ ప్లీజ్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన పిక్చర్‌లో ఉన్న ఫ్లోరియన్.. క్రికెటర్ విరాట్ కోహ్లీ మాదిరిగా కనిపిస్తుండటంతో ఈ ఫొటో అందరి అటెన్షన్‌ను క్యాచ్ చేసింది. అసలు విరాట్ తమన్నా వెనుక ఎందుకు కూర్చున్నాడు? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రైవేట్ జెట్‌లో విరాట్, తమన్నా ఏం చేస్తున్నారు? అని కొందరు కామెంట్ చేస్తుంటే.. అచ్చం కోహ్లీ మాదిరిగానే ఉన్నాడు కదా అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

Tags:    

Similar News