10 ఏళ్లు నిండితే డీజిల్ వాహనాలు ఇక షెడ్డుకే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటుంది. తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలపై చర్యలు తీసుకోనుంది. ఢిల్లీ ప్రభుత్వం వచ్చే ప్రారంభానికి 10 ఏళ్లు పూర్తిచేసే అన్ని డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనుంది. అయితే ఇతర ప్రదేశాలలో వాహానాలకు తిరిగి నమోదు చేసుకోవడానికి వీలుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌వోసీ) ఇవ్వనుంది. అయితే 15 ఏళ్లు పూర్తైన డిజీల్ వాహానాలకు […]
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ ప్రభుత్వం సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటుంది. తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలపై చర్యలు తీసుకోనుంది. ఢిల్లీ ప్రభుత్వం వచ్చే ప్రారంభానికి 10 ఏళ్లు పూర్తిచేసే అన్ని డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనుంది.
అయితే ఇతర ప్రదేశాలలో వాహానాలకు తిరిగి నమోదు చేసుకోవడానికి వీలుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌వోసీ) ఇవ్వనుంది. అయితే 15 ఏళ్లు పూర్తైన డిజీల్ వాహానాలకు మాత్రం ఎటువంటి ఎన్‌వోసీ ఇవ్వట్లేదని స్పష్టం చేసింది. కాగా, గతంలోనే జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) దేశ రాజధాని ప్రాంతంలో 10 ఏళ్లు పూర్తయిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు పూర్తయిన పెట్రోలు వాహనాలపై రిజిస్ట్రేషన్ల విషయంలో పరిమితులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ వాహానాలను ఎలక్ట్రిక్‌గా మార్చుకుంటే ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించింది.