తాజ్ మహల్ సందర్శనకు బ్రేక్
దిశ, ఆగ్రా :భారత్‌లో కోవిడ్-19(కరోనా) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజ్ మహల్ సందర్శనకు బ్రేక్ పడింది. విదేశీయుల వలన ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఇండియాలో మెడికల్ ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31వరకు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, జిమ్‌లు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈత కొలనులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశాయి. […]
దిశ, ఆగ్రా :భారత్‌లో కోవిడ్-19(కరోనా) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజ్ మహల్ సందర్శనకు బ్రేక్ పడింది. విదేశీయుల వలన ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఇండియాలో మెడికల్ ఎమర్జెన్సీ విధించారు. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 31వరకు పాఠశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, జిమ్‌లు, మ్యూజియంలు, సాంస్కృతిక, సామాజిక కేంద్రాలు, ఈత కొలనులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశాయి. కరోనా కట్టడికి కేంద్ర పర్యాటక శాఖ ఒక అడుగు మందుకు వేసి తాజ్ సందర్శనను తాత్కలికంగా నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో ఇప్పటి వరకు 126 కరోనా కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే టికెట్ల ద్వారా ప్రవేశానికి అనుమతించే అన్ని చారిత్రక కట్టడాలు, ప్రదర్శన శాలలు, మ్యూజియాలను మార్చి 31 వరకు మూసివేయాలని పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రకటించారు. తాజాగా భారత ప్రభుత్వం ఐరోపా సమాఖ్య దేశాలతో సహా టర్కీ, బ్రిటన్‌ల నుంచి వచ్చే పర్యాటకుల ప్రవేశాన్నిబుధవారం నుంచి నిషేధించింది.
Tags: tajmahal visiting close, delhi, agra, central touring minister, prahlad patel