క్యాన్సర్ మచ్చను గౌరవ బ్యాడ్జ్‌గా స్వీకరించండి :తహీరా కశ్యప్

దిశ, సినిమా: బాలీవుడ్ రైటర్, ఫిల్మ్ మేకర్ తహీరా కశ్యప్.. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది. క్యాన్సర్ పేషెంట్స్‌ను ఎంకరేజ్ చేస్తూ ఓ కవితను వీడియో రూపంలో షేర్ చేసింది. రొమ్ము క్యాన్సర్‌ను జయించిన తహీరా.. అందువల్ల ఏర్పడిన మచ్చలను గౌరవ బ్యాడ్జ్‌లాగా స్వీకరించాలని కోరింది. ‘మచ్చలు చాలా లోతైనవి.. కొన్ని కనిపిసిస్తాయి, కొన్ని దాచబడతాయి. అసలు విషయం ఏంటంటే ఇవి మీ గతాన్ని గుర్తు చేస్తాయి. మీరు అనుభవించిన బాధా క్షణాలు […]

Update: 2021-02-04 03:54 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ రైటర్, ఫిల్మ్ మేకర్ తహీరా కశ్యప్.. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ పెట్టింది. క్యాన్సర్ పేషెంట్స్‌ను ఎంకరేజ్ చేస్తూ ఓ కవితను వీడియో రూపంలో షేర్ చేసింది. రొమ్ము క్యాన్సర్‌ను జయించిన తహీరా.. అందువల్ల ఏర్పడిన మచ్చలను గౌరవ బ్యాడ్జ్‌లాగా స్వీకరించాలని కోరింది.

‘మచ్చలు చాలా లోతైనవి.. కొన్ని కనిపిసిస్తాయి, కొన్ని దాచబడతాయి. అసలు విషయం ఏంటంటే ఇవి మీ గతాన్ని గుర్తు చేస్తాయి. మీరు అనుభవించిన బాధా క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నక్షత్రాల మాదిరిగా చాలా రహస్యాలను దాచి ఉంచుతాయి. కానీ అంతకు మించిన పోరాటం, మీ అజేయ శక్తి గురించి మాట్లాడతాయి. క్యాన్సర్‌తో పోరాటం శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఉంటుంది. కొన్ని యుద్ధాలు జయించేందుకు మరింత కఠినమైనవే. కానీ విశ్వమంత శక్తిని కలిగిన ఫైటర్ మనలో ఉన్నాడు. ఏ భయానికీ లొంగని ఆత్మ మనలో ఉంది. మీ మచ్చలను దాచొద్దు, వాటిని చూపించండి, మీ ప్రకాశవంతమైన చిరునవ్వు వలె, ఇతర కళ్ళకు ఓదార్పునిస్తూ బయటపెట్టండి. మచ్చను మీ గౌరవ బ్యాడ్జ్‌గా స్వీకరించండి. ఇతరులను దానితో ప్రేమలో పడనివ్వండి. ముందుగా మీతో మీరు ప్రేమలో పడండి’ అని సూచించింది తహీరా కశ్యప్. రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు కట్టుబడి ఉండాలని కోరిన ఆమె.. తనతో పాటుగా ‘ఐ యామ్ అండ్ ఐ విల్’ థీమ్‌తో క్యాన్సర్‌పై పోరాటానికి సిద్ధం కావాలని కోరింది.

Tags:    

Similar News