ఇండియాలో అది సురక్షితం కాదు: పాట్ కమిన్స్
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను ఈ ఏడాది ఇండియాలో నిర్వహించడం సురక్షితం కాదని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఇండియాలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న సమయంలో భారతీయులకు ఏది మంచిదో అని ఆలోచించి బీసీసీఐ, ఐసీసీ కలసి సరైన నిర్ణయం తీసుకోవాలని కమిన్స్ అన్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 14 అర్దాంతరంగా వాయిదా పడింది.. మరో 5 నెలల్లో మెగా ఈవెంట్ ఇండియాలో నిర్వహించాల్సి ఉన్నది. అప్పటికి కరోనా […]
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను ఈ ఏడాది ఇండియాలో నిర్వహించడం సురక్షితం కాదని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఇండియాలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న సమయంలో భారతీయులకు ఏది మంచిదో అని ఆలోచించి బీసీసీఐ, ఐసీసీ కలసి సరైన నిర్ణయం తీసుకోవాలని కమిన్స్ అన్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 14 అర్దాంతరంగా వాయిదా పడింది.. మరో 5 నెలల్లో మెగా ఈవెంట్ ఇండియాలో నిర్వహించాల్సి ఉన్నది. అప్పటికి కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుతుందని చెప్పలేము. కాబట్టి సాధ్యమైనంతగా ఇండియా నుంచి టీ20 వరల్డ్ కప్‌ను తరలించడమే మంచిదని.. ఇండియాలో మెగా టోర్నీ నిర్వహణ సురక్షితం కాదని కమిన్స్ పేర్కొన్నాడు. యూఏఈకి ఈ టోర్నీని నిర్వహించే బాధ్యతలు కట్టబెట్టాలని అన్న కమిన్స్.. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం కూడా తొందరపాటే అవుతుందని చెబుతున్నాడు.