గుండుకొట్టించుకున్న నటరాజన్.. ఎందుకో తెలుసా..?
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి అందరి ప్రశంసలు అందుకున్న టి. నటరాజన్ దేవుడి మొక్కు తీర్చుకున్నాడు. తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని శనివారం సందర్శించిన నటరాజన్.. అక్కడ తలనీలాలు సమర్పించి ఆలయంలో పూజలు నిర్వహించాడు. నటరాజన్ వచ్చిన విషయాన్ని తెలుసుకొని అక్కడికి క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. నటరాజన్‌తో సెల్ఫీలు దిగడానికి పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన నటరాజన్ […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి అందరి ప్రశంసలు అందుకున్న టి. నటరాజన్ దేవుడి మొక్కు తీర్చుకున్నాడు. తమిళనాడులోని దిండిగల్ జిల్లా పళనిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని శనివారం సందర్శించిన నటరాజన్.. అక్కడ తలనీలాలు సమర్పించి ఆలయంలో పూజలు నిర్వహించాడు. నటరాజన్ వచ్చిన విషయాన్ని తెలుసుకొని అక్కడికి క్రికెట్ అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
నటరాజన్‌తో సెల్ఫీలు దిగడానికి పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన నటరాజన్ అక్కడ సన్‌రైజర్స్ తరపున సత్తా చాటాడు. అదే సమయంలో బీసీసీఐ అతడిని నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా పంపింది. అనుకోకుండా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన నటరాజన్ తన సత్తా చాటాడు. కాగా, ఆలయంలో పూజలు చేసిన అనంతరం నటరాజన్ మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది పళని దండాయుధపాణి స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితి అని చెప్పాడు. ఈ సారి తనకు టీమ్ ఇండియాలో అవకాశం రావడమే కాకుండా, కొడుకు పుట్టిన ఆనందంలో ఇక్కడకు వచ్చినట్లు నటరాజన్ చెప్పాడు.