జులై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మార్పు

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కమర్షియల్ సిండికేట్ బ్యాంకును ప్రభుత్వం రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా కెనరా బ్యాంకులో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారుతుందని కెనరా బ్యాంకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2020, ఏప్రిల్‌లో సిండికేట్ బ్యాంకు విలీనం తర్వాత దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కెనరా బ్యాంకుగా నిలిచింది. దీంతో సిండికేట్ బ్యాంకుకు సంబంధించి ఆన్‌లైన్ లావాదేవీలతో […]

Update: 2021-06-11 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కమర్షియల్ సిండికేట్ బ్యాంకును ప్రభుత్వం రంగ బ్యాంకుల విలీనంలో భాగంగా కెనరా బ్యాంకులో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారుతుందని కెనరా బ్యాంకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 2020, ఏప్రిల్‌లో సిండికేట్ బ్యాంకు విలీనం తర్వాత దేశంలోనే నాలుగో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కెనరా బ్యాంకుగా నిలిచింది. దీంతో సిండికేట్ బ్యాంకుకు సంబంధించి ఆన్‌లైన్ లావాదేవీలతో సహా ఇతర లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

జులై 1 నుంచి సిండికేట్ బ్యాంక్ వినియోగదారులు నెఫ్ట్, ఆర్‌టీజీఎస్, ఐఎంపీఎస్ విధానంలో జరిపే నగదు లావాదేవీలకు కెనరా బ్యాంకు ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని బ్యాంకు వివరించింది. ఖాతాదారులు కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ కోసం కెనరా బ్యాంకు వెబ్‌సైడ్ నుంచి లేదా, బ్యాంకు బ్రాంచ్‌ను కానీ సంప్రదించాలని కెనరా బ్యాంకు తెలిపింది. అలాగే, మారిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌తో కూడిన చెక్‌బుక్‌లను తీసుకోవాలని ఖాతాదారులకు స్పష్టం చేసింది.

Tags:    

Similar News