కరోనా పరీక్షలో బయటపడిన స్వైన్ ఫ్లూ
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో దేశంలో చైనాతో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా మణిపూర్ నుంచి ఒక ఆరు శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయాలజీకి పంపించారు. వాటిలో మూడు శాంపిళ్ల ఫలితాల్లో ఇద్దరికి కరోనా కాదు కానీ స్వైన్ ఫ్లూ ఉందని తెలిసింది. అయితే కరోనాతో పాటు స్వైన్ ఫ్లూ కూడా విజృంభిస్తోందనే అనే అనుమానాలకు ఇది తావిస్తోంది. […]
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో దేశంలో చైనాతో సరిహద్దు ఉన్న రాష్ట్రాల్లో వైద్య పరీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా మణిపూర్ నుంచి ఒక ఆరు శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయాలజీకి పంపించారు. వాటిలో మూడు శాంపిళ్ల ఫలితాల్లో ఇద్దరికి కరోనా కాదు కానీ స్వైన్ ఫ్లూ ఉందని తెలిసింది.
అయితే కరోనాతో పాటు స్వైన్ ఫ్లూ కూడా విజృంభిస్తోందనే అనే అనుమానాలకు ఇది తావిస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు చైనా నుంచి ఇండియాకు వచ్చిన వారు కాగా, మరొకరు అతనితో ప్రత్యక్ష సంబంధం కలిగినవారు. వీరిద్దరికీ కొద్ది మోతాదులో స్వైన్ ఫ్లూ ఉందని తెలిసిన తర్వాత వాళ్లని పరిశీలనలో ఉంచినట్లు మణిపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రంలోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర పెట్టిన ఐదు కేంద్రాల్లో కరోనాతో పాటు స్వైన్ ఫ్లూ స్క్రీనింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటివరకు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదుకాలేదని, సోషల్ మీడియాలో సంచరిస్తున్న వార్తలను నమ్మొద్దని వారు కోరారు.