టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ఎండగడుతాం : స్వామిగౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పాలనను ఎండగట్టేలా ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతుందని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తెలిపారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాసంగ్రామ పాదయాత్ర కరపత్రాలను ఆయన విడుదల చేశారు. అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఎలాంటి పురోగతి రాలేదని ఆరోపించారు. నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల లెక్కలు […]
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పాలనను ఎండగట్టేలా ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతుందని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ తెలిపారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రజాసంగ్రామ పాదయాత్ర కరపత్రాలను ఆయన విడుదల చేశారు. అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఎలాంటి పురోగతి రాలేదని ఆరోపించారు. నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఉద్యోగుల లెక్కలు తేల్చకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు.
తెలంగాణ కాంట్రాక్టర్లను ప్రోత్సహించకుండా ప్రాజెక్ట్‌లన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకే అప్పగిస్తున్నారని ఆరోపించారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు ఇప్పటి వరకు నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు. చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన గడీల పాలన ప్రస్తుతం సీఎం కేసీఆర్ ద్వారా చూస్తున్నామని చెప్పారు. ఐఏఎస్ అధికారులతో కాళ్లు మొక్కించుకొని దొరల పాలన గుర్తుచేస్తున్నారని తెలిపారు. ప్రజల మద్దతు కూడగట్టేందుకు పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. రోహింగ్యాలు తెలంగాణకు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారనే అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి డిమాండ్ చేశారు. ముస్లింల పేరుతో బయటనుంచి వచ్చినవారు అరాచకాలు సృష్టిస్తున్నారని ముస్లిం పెద్దలు దీనిని గమనించాలని కోరారు.
సీఎం కేసీఆర్ అసమర్థత వలనే కృష్ణ జలాలను వినియోగించుకోలేక పోతున్నామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఏపీ సీఎంతో ఒప్పందాలు చేసుకొని కృష్ణ పరివాహక ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. 2015లోని కృష్ణ జలాల సమావేశంలో తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకొని ద్రోహిగా మిగిలారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి, ప్రాజెక్ట్ ను రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా డిజైన్ చేస్తే దానిని 0.5 టీ ఎంసీలకు కుదించారని ఆరోపించారు.