మాజీ ఐఏఎస్ శివశంకర్‌కు బెయిల్

తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ కేసుల్లో గత 98 రోజులుగా జైలులో ఉన్న కేరళ సీఎం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం శివశంకర్‌కు బుధవారం విడుదలయ్యారు. పినరయి విజయన్ ప్రభుత్వంలో గత ఏడాది జూలై వరకు ఐటీశాఖ‌కు శివ శంకర్ నేతృత్వం వహించారు. యూఎస్ డాలర్ స్మగ్లింగ్ కేసులో ఆయనకు ఆర్థిక నేరాల కోర్టు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం కొచ్చిలో దర్యాప్తు అధికారుల ఎదుట […]

Update: 2021-02-03 09:29 GMT

తిరువనంతపురం: గోల్డ్ స్మగ్లింగ్, మనీ లాండరింగ్ కేసుల్లో గత 98 రోజులుగా జైలులో ఉన్న కేరళ సీఎం మాజీ ముఖ్య కార్యదర్శి ఎం శివశంకర్‌కు బుధవారం విడుదలయ్యారు. పినరయి విజయన్ ప్రభుత్వంలో గత ఏడాది జూలై వరకు ఐటీశాఖ‌కు శివ శంకర్ నేతృత్వం వహించారు. యూఎస్ డాలర్ స్మగ్లింగ్ కేసులో ఆయనకు ఆర్థిక నేరాల కోర్టు అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం కొచ్చిలో దర్యాప్తు అధికారుల ఎదుట తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. తిరువనంతపురం యూఏఈ రాయబార కార్యాలయంలో పనిచేసిన మాజీ ఆర్థిక అధిపతి ఒకరు మస్కట్‌కు 1.90లక్షల యూఎస్ డాలర్లను అక్రమంగా తరలించాడు. ఈ కేసులో శివశంకర్ అభియోగాలను ఎదుర్కొటున్నారు.

Tags:    

Similar News