సరిహద్దు దాటిన పాకిస్తాన్ అనుమానితుడి కాల్చివేత
అహ్మదాబాద్: సరిహద్దు గుండా చొరబాటుకు యత్నించిన పాకిస్తాన్ అనుమానితుడిని బీఎస్ఎఫ్ జవాన్లు మట్టుబెట్టారు. గుజరాత్, రాజస్తాన్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి దుండగుడు అంతర్జాతీయ సరిహద్దు దాటి ఫెన్సింగ్ ఎక్కి దూకినట్టు పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ గుర్తించింది. అక్కడ చీకటిగా ఉండటంతో స్వీయరక్షణలో భాగంగా జవాన్లు కాల్పులు జరిపారు. పాకిస్తాన్ అనుమానితుడు అక్కడి నుంచి పరుగులు తీసి చెట్ల పొదల వెనుక దాక్కున్నట్టు కొనుగొన్నారు. వెళ్లి చూడగా, అప్పటికే బుల్లెట్ గాయాలతో మరణించి ఉన్నాడని […]
అహ్మదాబాద్: సరిహద్దు గుండా చొరబాటుకు యత్నించిన పాకిస్తాన్ అనుమానితుడిని బీఎస్ఎఫ్ జవాన్లు మట్టుబెట్టారు. గుజరాత్, రాజస్తాన్‌కు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి దుండగుడు అంతర్జాతీయ సరిహద్దు దాటి ఫెన్సింగ్ ఎక్కి దూకినట్టు పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ గుర్తించింది. అక్కడ చీకటిగా ఉండటంతో స్వీయరక్షణలో భాగంగా జవాన్లు కాల్పులు జరిపారు.
పాకిస్తాన్ అనుమానితుడు అక్కడి నుంచి పరుగులు తీసి చెట్ల పొదల వెనుక దాక్కున్నట్టు కొనుగొన్నారు. వెళ్లి చూడగా, అప్పటికే బుల్లెట్ గాయాలతో మరణించి ఉన్నాడని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. కాల్పులపై వివరణ కోరగా, గతంలో ఇలా సరిహద్దు దాటినవారిని అదుపులోకి తీసుకున్నామని, కానీ, వారంతా పగలు దాటారని వివరించారు. ఇలా ఫెన్సింగ్ ఎక్కిన ఘటనలు ఇక్కడ అరుదని తెలిపారు.