ఇది నాన్నల గొప్పతనం : సుష్మిత

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఫాదర్స్ డే సందర్భంగా స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ సమయంలో చిరుకు హెయిర్‌కట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన సుష్మిత.. ‘జీవితంలో ఇంత ప్రేమ పంచిన తండ్రికి ధన్యవాదాలు’ అని తెలిపింది. సింపుల్ హెయిర్‌కట్ నుంచి జీవితంలోని అత్యంత కీలక విషయాల్లోనూ తనను నమ్మినందుకు థాంక్స్ చెప్పింది. ‘నాన్న తనపై ఉంచిన నమ్మకమే.. తనను కాన్ఫిడెంట్‌గా తీర్చిదిద్దింది. ఇది నాన్నల గొప్పతనం’ అంటూ చిరుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు […]

Update: 2020-06-21 04:31 GMT

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత ఫాదర్స్ డే సందర్భంగా స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ సమయంలో చిరుకు హెయిర్‌కట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేసిన సుష్మిత.. ‘జీవితంలో ఇంత ప్రేమ పంచిన తండ్రికి ధన్యవాదాలు’ అని తెలిపింది. సింపుల్ హెయిర్‌కట్ నుంచి జీవితంలోని అత్యంత కీలక విషయాల్లోనూ తనను నమ్మినందుకు థాంక్స్ చెప్పింది. ‘నాన్న తనపై ఉంచిన నమ్మకమే.. తనను కాన్ఫిడెంట్‌గా తీర్చిదిద్దింది. ఇది నాన్నల గొప్పతనం’ అంటూ చిరుకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. కాగా ఈ హెయిర్‌కట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.

https://www.instagram.com/p/CBsKtHnnDDG/?igshid=1h3ero8p8iahq

ఇక సుష్మిత.. చిరు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ వర్క్ చేసింది. ఖైదీ నం. 150, సైరా చిత్రాలకు తండ్రితో కలిసి పని చేసి ప్రశంసలు అందుకుంది. కాగా కొరటాల – చిరు కాంబినేషన్‌లో వస్తున్న ఆచార్య సినిమాకు కూడా సుష్మితనే చిరు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News