సుశాంత్ మెమోరియల్..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పూడ్చలేనిదన్నారు ఆయన కుటుంబ సభ్యులు. తన నవ్వులు ఇక వినలేమని.. ఆ కళ్లలో మెరుపు ఇక చూడలేమని.. సైన్స్ గురించి తన చర్చలు పొందలేమని అన్నారు. తను ప్రతీ ఒక్క అభిమానిని ప్రేమించేవాడన్న కుటుంబ సభ్యులు.. తనను అంతగా అభిమానించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. Official Statement from #SushantSinghRajput’s family #RIPSushantSinghRajput pic.twitter.com/oSfivcl5V7 — BARaju (@baraju_SuperHit) June 27, 2020 కాగా.. తన జ్ఞాపకాలు, చరిత్రను గౌరవిస్తూ తామొక […]
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పూడ్చలేనిదన్నారు ఆయన కుటుంబ సభ్యులు. తన నవ్వులు ఇక వినలేమని.. ఆ కళ్లలో మెరుపు ఇక చూడలేమని.. సైన్స్ గురించి తన చర్చలు పొందలేమని అన్నారు. తను ప్రతీ ఒక్క అభిమానిని ప్రేమించేవాడన్న కుటుంబ సభ్యులు.. తనను అంతగా అభిమానించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
Official Statement from #SushantSinghRajput’s family #RIPSushantSinghRajput pic.twitter.com/oSfivcl5V7
— BARaju (@baraju_SuperHit) June 27, 2020
కాగా.. తన జ్ఞాపకాలు, చరిత్రను గౌరవిస్తూ తామొక నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు కుటుంబీకులు. యంగ్ టాలెంట్స్‌ను సపోర్ట్ చేసేందుకు ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్’ను స్థాపించబోతున్నట్లు తెలిపారు. పాట్నాలోని రాజీవ్ నగర్‌లో ఉన్న తన చిన్ననాటి ఇంటిని ‘సుశాంత్ మెమోరియల్’గా మారుస్తున్నట్లు వెల్లడించారు. తనకు సంబంధించిన ప్రతీ వస్తువును అక్కడ పొందుపరుస్తామని తెలిపారు. సుశాంత్‌కు చెందిన వేల సంఖ్యలో ఉన్న పుస్తకాలు, టెలీస్కోప్, ఫ్లైట్ సిములేటర్ లాంటివి అక్కడ భద్రపరుస్తామని చెప్పారు. ఇప్పటి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ అకౌంట్‌లను లెగసీ అకౌంట్స్‌గా మారుస్తూ తన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతామన్నారు.