మోడీకి సుశాంత్ సోదరి విజ్ఞప్తి

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు రోజుకో కారణం వినిపిస్తోంది. రోజుకొకరు నిందితులుగా తెరమీదకి వస్తున్నారు. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు కూడా నిందితుల జాబితాలో చేరింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో రియా పేరు తెరపైకి రాగా.. ఇప్పుడు తన సోదరి సుశాంత్ కేసులో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరింది. మీరు నిజం వైపు నిలబడతారని నా మనసు చెబుతోందన్న శ్వేతా సింగ్.. మేము చాలా సాధారణ కుటుంబానికి చెందిన […]

Update: 2020-08-01 06:56 GMT

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు రోజుకో కారణం వినిపిస్తోంది. రోజుకొకరు నిందితులుగా తెరమీదకి వస్తున్నారు. తాజాగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు కూడా నిందితుల జాబితాలో చేరింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో రియా పేరు తెరపైకి రాగా.. ఇప్పుడు తన సోదరి సుశాంత్ కేసులో జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరింది.

మీరు నిజం వైపు నిలబడతారని నా మనసు చెబుతోందన్న శ్వేతా సింగ్.. మేము చాలా సాధారణ కుటుంబానికి చెందిన వాళ్ళమని చెప్పింది. నా తమ్ముడు బాలీవుడ్‌లో ఎంటర్ అయినప్పుడు తనకు గాడ్ ఫాదర్ లేరని.. ఇప్పుడు కూడా మాకు ఎవరూ సపోర్టర్స్ లేరని ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి మీరు త్వరగా ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోవాలని కోరింది. సాక్షాలు తారుమారు కాకుండా చూడాలని.. మాకు న్యాయం చేయాలని కోరింది సుశాంత్ సోదరి.

Tags:    

Similar News