సుశాంత్ మేనేజర్ సూసైడ్ కేసు.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుశాంత్‌ ఆత్మహత్యకు ముందే జూన్ 8న దిశా మేడ మీది నుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటన తర్వాతే సుశాంత్ కూడా సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వచ్చాయి. అయితే, దిశా మృతిపై కూడా క్షేత్ర స్థాయిలో విచారణ చేసేందుకు ముంబయి పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన […]

Update: 2020-08-05 10:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ దిశా శాలియన్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుశాంత్‌ ఆత్మహత్యకు ముందే జూన్ 8న దిశా మేడ మీది నుంచి దూకి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటన తర్వాతే సుశాంత్ కూడా సూసైడ్ చేసుకోవడంతో పలు అనుమానాలు వచ్చాయి. అయితే, దిశా మృతిపై కూడా క్షేత్ర స్థాయిలో విచారణ చేసేందుకు ముంబయి పోలీసులు భావిస్తున్నారు.

అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ నేత నారాయణ్ రాణే ఆమెపై అత్యాచారం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. పోస్టు మార్టం రిపోర్టులో ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాలు ఉన్నట్టు స్పష్టం చేశారు. ఈ కేసుపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News