ప్రైవేట్ ఆస్పత్రుల తీరుపై కలెక్టర్ సీరియస్
దిశ, సూర్యాపేట: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర సమయంలో పేషెంట్ల రోగాన్ని ఆసరాగా చేసుకొని, అధిక వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. మందుల కృత్రిమ కొరత, ధరల నియంత్రణపై ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, వారు ఎప్పటికప్పుడు నివేదికలు అందచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధిక వసూళ్లకు పాల్పడితే వెంటనే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ […]
దిశ, సూర్యాపేట: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర సమయంలో పేషెంట్ల రోగాన్ని ఆసరాగా చేసుకొని, అధిక వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి హెచ్చరించారు. మందుల కృత్రిమ కొరత, ధరల నియంత్రణపై ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, వారు ఎప్పటికప్పుడు నివేదికలు అందచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా రోగుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధిక వసూళ్లకు పాల్పడితే వెంటనే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్ కంట్రోల్ రూంకు 6281492368, 6300957120 ఫిర్యాదు చేయాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లాలో చేపట్టిన లాక్‌డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరించాలని, లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చెయ్యాలని పోలీసులకు సూచించారు. జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు లాక్ డౌన్ సమయంలో పోలీసులు, సంబంధిత అధికారులు పూర్తిగా సహకరిస్తూ సమన్వయంతో పనిచేయాలన్నారు.