పోలీస్ రైడ్స్: సురేష్ రైనా, సుసాన్ అరెస్ట్.. ఏమైందంటే..?
దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్‌లో కరోనా కొత్త రూపు స్ట్రెయిన్ ఉనికిలోకి రావడంతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇన్నిరోజులు కరోనాతో అల్లాడిన ప్రజలు ఇప్పుడు.., కరోనా కొత్త రూపు స్ట్రెయిన్ ఉనికిలోకి రావడంతో బ్రిటన్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రజలు సైతం బ్రతుకు జీవుడా అంటూ భయం భయంగా గడుపుతున్నారు. దీంతో కేంద్రప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. బ్రిటన్ తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు […]
దిశ, వెబ్ డెస్క్ : బ్రిటన్‌లో కరోనా కొత్త రూపు స్ట్రెయిన్ ఉనికిలోకి రావడంతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇన్నిరోజులు కరోనాతో అల్లాడిన ప్రజలు ఇప్పుడు.., కరోనా కొత్త రూపు స్ట్రెయిన్ ఉనికిలోకి రావడంతో బ్రిటన్ తో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రజలు సైతం బ్రతుకు జీవుడా అంటూ భయం భయంగా గడుపుతున్నారు. దీంతో కేంద్రప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. బ్రిటన్ తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ రాకపోకలపై ఆంక్షలు విధించింది. వైరస్ వ్యాప్తి వేగవంతం అయ్యిందని జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
పబ్లిక్ ప్రదేశాల్లో కరోనా జాగ్రత్తల్ని పాటించాలని సూచించింది. దీంతో పాటు రెస్టారెంట్స్, హోటల్స్, క్లబ్ లలో నామమాత్రంగా అనుమతులిచ్చింది. నిబంధనల్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేసింది. అయితే పలువురు ప్రముఖులు మాత్రం కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాల్ని బేఖాతర్ చేస్తున్నారు. సందట్లో సడేమియా అన్న చందంగా ఎవరు ఏం చెబితేం మాకేం. మేం చేయాల్సింది మేం చేస్తామంటూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఈనేపథ్యంలో కరోనా నిబంధనల్ని ఉల్లంఘించి, ప్రొటోకాల్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేశారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్‌ఫ్లై క్లబ్ పై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇండియన్ మాజీ క్రికెటర్ సురేష్ రైనా తో పాటు బాలీవుడ్ కండల వీరుడు హృత్తిక్ రోషన్ మాజీ భార్య సుసాన్ ఖాన్, ప్రముఖ సింగ్ గురు రంధ్వార తో పాటు మొత్తం 34మంది ప్రముఖుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా నిబంధనల్ని ఉల్లంఘింస్తూ అక్కడ నిర్వహించిన పార్టీకి అటెండ్ అయినందుకు అరెస్ట్ చేశామని ముంబై పోలీసులు తెలిపారు. అనంతరం వారిపై సెక్షన్ 188, సెక్షన్ 269 కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అరెస్టైన కొద్దిసేపటికే రైనాతో పాటు ప్రముఖులు బెయిల్ పై విడుదలవ్వడం కొసమెరుపు.
కాగా బ్రిటన్‌లో వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు చర్యగా మహారాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 22నుండి జనవరి 5 వరకు ప్రజా కార్యకలాపాలపై వరుస ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.