ఎట్టకేలకు.. సుశాంత్ కేసు సీబీఐకు బదిలీ

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్(SSR) ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు (SUPREAM COURT) కీలక తీర్పునిచ్చింది. ఈ కేసును విచారించాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో ఇదివరకు సేకరించిన ఆధారాలను సీబీఐ(CBI)కి అప్పగించాలని, దర్యాప్తులో ఏజెన్సీకి మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని తెలిపింది. బీహార్‌ రాజధాని పాట్నాలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో నమోదైన ఎఫ్ఐఆర్ సరైనదేనని, సీబీఐకి సూచించడం న్యాయమైనదేనని పేర్కొంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసే చట్టబద్ధత బీహార్‌(BIHAR)కు ఉన్నదని వివరించింది. ఈ […]

Update: 2020-08-19 08:30 GMT

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్(SSR) ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు (SUPREAM COURT) కీలక తీర్పునిచ్చింది. ఈ కేసును విచారించాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో ఇదివరకు సేకరించిన ఆధారాలను సీబీఐ(CBI)కి అప్పగించాలని, దర్యాప్తులో ఏజెన్సీకి మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని తెలిపింది. బీహార్‌ రాజధాని పాట్నాలో సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదుతో నమోదైన ఎఫ్ఐఆర్ సరైనదేనని, సీబీఐకి సూచించడం న్యాయమైనదేనని పేర్కొంది.

ఈ కేసును సీబీఐకి బదిలీ చేసే చట్టబద్ధత బీహార్‌(BIHAR)కు ఉన్నదని వివరించింది. ఈ తీర్పును సవాలు చేసే అవకాశం మహారాష్ట్రకు లేదని జస్టిస్ హృషికేష్ రాయ్ సింగిల్ జడ్జి బెంచ్ తెలిపింది. పాట్నాలో నమోదైన ఎఫ్ఐఆర్‌(FIR)ను ముంబయికి ట్రాన్స్‌ఫర్ చేయాలని సుశాంత్ ప్రేయసిగా భావిస్తున్న రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై బెంచ్ విచారణ చేపట్టింది. సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని కేసులు నమోదైనా వాటన్నింటినీ సీబీఐ మాత్రమే దర్యాప్తు చేస్తుందని తీర్పునిచ్చింది. ఈ కేసు దర్యాప్తునకు ముంబయి పోలీసులకు అవకాశముంటుందని, కానీ, బిహార్, మహారాష్ట్రల మధ్య జరిగిన వాదోపవాదాల నేపథ్యంలో ఆర్టికల్ 142 కింద సీబీఐతో దర్యాప్తు జరిపించడమే సరైనదని కోర్టు భావిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ముంబయి పోలీసుల దర్యాప్తులోనూ పొరపాట్లు లేవని వివరించారు.

అయితే, బిహార్ పోలీసు బృందాన్ని అడ్డుకోవడం మూలంగా అనుమానాలు వచ్చాయని పేర్కొన్నారు. కాగా, కేకే సింగ్ తరఫు న్యాయవాది, బీహార్ పోలీసులు ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. తమ ఎఫ్ఐఆరే సరైనదని, ప్రజల్లో పోలీసులపట్ల నమ్మకాన్ని కలిగించేలా తీర్పు ఉన్నదని వ్యాఖ్యానించారు. కాగా, సీబీఐకి తాము సేకరించిన ఆధారాలు సమర్పిస్తామని, తదుపరి చర్యలపై ఆలోచిస్తున్నామని ముంబయి పోలీసులు తెలిపారు. కాగా, రియా స్వయంగా సీబీఐ దర్యాప్తును కోరిందని, గతంలో ముంబయి పోలీసులు, ఈడీ (ED) ముందు హాజరైన రియా ఇప్పుడు సీబీఐ ముందు దర్యాప్తునకు హాజరవుతుందని సతీష్ మానె షిండే తెలిపారు. ఏ ఏజెన్సీ దర్యాప్తు చేసినా సత్యం మారదని ఆమె పేర్కొన్న వ్యాఖ్యను ప్రస్తావించారు.

Tags:    

Similar News