హాథ్రస్ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో 19ఏళ్ల దళిత యువతిపై హత్యాచారానికి సంబంధించిన కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు ముగిసే వరకు కేసు విచారణను యూపీ బయటికి బదిలీ చేయాలనే అభ్యర్థనను పరిగణించబోమని స్పష్టం చేసింది. ఈ కేసులోని అన్ని అంశాలనూ హైకోర్టు పరిశీలిస్తుందని, సాక్షులకు భద్రత కల్పిస్తారని సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో పారదర్శకమైన దర్యాప్తు సాధ్యపడదని, ఇప్పటికే విచారణను పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ […]

Update: 2020-10-27 10:38 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లో 19ఏళ్ల దళిత యువతిపై హత్యాచారానికి సంబంధించిన కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు ముగిసే వరకు కేసు విచారణను యూపీ బయటికి బదిలీ చేయాలనే అభ్యర్థనను పరిగణించబోమని స్పష్టం చేసింది.

ఈ కేసులోని అన్ని అంశాలనూ హైకోర్టు పరిశీలిస్తుందని, సాక్షులకు భద్రత కల్పిస్తారని సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో పారదర్శకమైన దర్యాప్తు సాధ్యపడదని, ఇప్పటికే విచారణను పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ కార్యకర్తలు, న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేశారు. విచారణను యూపీ వెలుపలికి బదిలీ చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ విచారిస్తూ తాజాగా సుప్రీంకోర్టు పై ఆదేశాలను జారీ చేసింది.

Tags:    

Similar News