సీఎం, స్పీకర్, గవర్నర్‌‌లకు ‘సుప్రీం’ నోటీసులు

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ సర్కారుకు 12 గంటల్లో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించేందుకు ఆదేశించాలని బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కానీ, మంగళవారం ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు కమల్‌నాథ్ సర్కారు తరఫు న్యాయవాది కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఈ పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం.. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి, గవర్నర్ లాల్‌జీ టాండన్, అసెంబ్లీ సెక్రెటరీలకు నోటీసులు పంపింది. […]

Update: 2020-03-17 01:51 GMT

న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ సర్కారుకు 12 గంటల్లో ఫ్లోర్ టెస్ట్ నిర్వహించేందుకు ఆదేశించాలని బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. కానీ, మంగళవారం ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు కమల్‌నాథ్ సర్కారు తరఫు న్యాయవాది కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఈ పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం.. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి, గవర్నర్ లాల్‌జీ టాండన్, అసెంబ్లీ సెక్రెటరీలకు నోటీసులు పంపింది. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై తమ స్పందనలను వివరించాలని ఆదేశించింది. అనంతరం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లో బెంగళూరులోని రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాగమయ్యేందుకు అనుమతినిచ్చింది.

Tags: supreme court, notices, madhya pradesh, cm kamalnath, speaker, governor

Tags:    

Similar News