బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీం బ్రేకులు
దిశ వెబ్‌డెస్క్: బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. పెగాసెస్ వివాదంపై ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దర్యాప్తుపై ముందుకు వెళ్లద్దని ఆదేశించింది. ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై విచారణ జరిగే వరకు కమిటీ సంయమనం పాటిస్తుందని బెంగాల్ ప్రభుత్వం తరుపు న్యాయవాది అభిషేక్ మనుసింగ్వి […]
దిశ వెబ్‌డెస్క్: బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. పెగాసెస్ వివాదంపై ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దర్యాప్తుపై ముందుకు వెళ్లద్దని ఆదేశించింది. ఇప్పటికే కోర్టులో విచారణ జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బెంచ్ స్పష్టం చేసింది. దీనిపై విచారణ జరిగే వరకు కమిటీ సంయమనం పాటిస్తుందని బెంగాల్ ప్రభుత్వం తరుపు న్యాయవాది అభిషేక్ మనుసింగ్వి మౌఖిక హామీ ఇచ్చారు.
న్యాయబద్ధంగానే కమిటీ ఏర్పాటు చేశారని సుప్రీంకోర్టుకు విన్నవించారు. కోర్టులో విచారణ జరుగుతున్నపుడు బయట ఎటువంటి దర్యాప్తు చేయవద్దని ఎన్జీవో తరపు న్యాయవాది హరీష్ సాల్వే కోరారు. కమిషన్ దర్యాప్తుకు ఎటువంటి న్యాయబద్ధత లేదని పేర్కొన్నారు. విచారణ కమిషన్ ద్వారా పబ్లిక్ నోటీస్ జారీ చేశారని రోజువారి ప్రొసిడింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. కాస్త సంయమనం పాటిస్తూ, మరికొంత సమయం వేచి చూడాలని సింగ్విని ఉద్దేశించి సీజేఐ రమణ అన్నారు. కాగా, పెగాసెస్ వివాదంలో నిర్ణయమేదైనా దేశం అంత ఆసక్తిగా ఎదురు చూస్తుందని అన్నారు. జర్నలిస్టులు, సామాజికవేత్తలు, ప్రజాప్రతినిధులుపై ఇజ్రాయెల్ స్పైవేర్ తో దాడి చేస్తుందని స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆగస్టు 17న కేంద్రానికి ముందస్తు నోటీసులు జారీ చేసింది.