కేరళ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం.. పండుగ అని వదిలేస్తారా..?
దిశ, వెబ్‌డెస్క్ : కేరళ ప్రభుత్వంపై దేశ అత్యున్నత స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు, జికా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు ఎలా సడలిస్తారంటూ మండిపడింది. అయితే, బక్రీద్ పండుగ సందర్భంగా వ్యాపారుల ఒత్తిడి మేరకు సడలింపులు ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించగా.. పండుగ అయితే అలా ఎలా సడలిస్తారంటూ ప్రశ్నించింది. కేరళ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం.. పౌరులు జీవించే హక్కుకు భంగం కలిగించినట్టే అని […]
దిశ, వెబ్‌డెస్క్ : కేరళ ప్రభుత్వంపై దేశ అత్యున్నత స్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు, జికా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ నిబంధనలు ఎలా సడలిస్తారంటూ మండిపడింది. అయితే, బక్రీద్ పండుగ సందర్భంగా వ్యాపారుల ఒత్తిడి మేరకు సడలింపులు ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించగా.. పండుగ అయితే అలా ఎలా సడలిస్తారంటూ ప్రశ్నించింది.
కేరళ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం.. పౌరులు జీవించే హక్కుకు భంగం కలిగించినట్టే అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా, పౌరులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చీఫ్ జస్టిస్ స్పష్టంచేశారు.