తన రూట్ సపరేట్ అంటున్న సూపర్ స్టార్

దిశ, వెబ్ డెస్క్: ఇళయ తలపతి విజయ్..కోలీవుడ్ నెక్స్ట్ సూపర్ స్టార్‌. సినీ అభిమానుల హృదయాలు దోచుకున్న హీరో. కోలీవుడ్‌కే పరిమితం కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఆయన హవా కొనసాగుతున్నది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి ‘ఖైదీ’ ఫేం డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ చిత్రాలు ఇతర భాషల్లోనూ రిలీజ్ అయి సక్సెస్ అవుతున్నాయి. ఇటీవల […]

Update: 2020-11-13 02:38 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇళయ తలపతి విజయ్..కోలీవుడ్ నెక్స్ట్ సూపర్ స్టార్‌. సినీ అభిమానుల హృదయాలు దోచుకున్న హీరో. కోలీవుడ్‌కే పరిమితం కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఆయన హవా కొనసాగుతున్నది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో కలిసి ‘ఖైదీ’ ఫేం డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘మాస్టర్’ మూవీ రిలీజ్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ చిత్రాలు ఇతర భాషల్లోనూ రిలీజ్ అయి సక్సెస్ అవుతున్నాయి. ఇటీవల ఆయన తండ్రి చంద్రశేఖర్ రాజకీయ పార్టీ‌ని ప్రారంభించడంతో తండ్రీ కొడుకుల మధ్య వివాదం మొదలైంది. చంద్రశేఖర్ పార్టీని ప్రకటించిన వెంటనే విజయ్ స్పందించారు. తనకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, తన దారి సపరేట్ అని చెప్పారు. ఆ పార్టీలో తన అభిమానులు ఎవరు చేరవద్దంటూ సూచించారు. ఆ పార్టీ కోసం తన అభిమాన సంఘం పేరును కానీ, తన ఫొటోను కానీ, ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించాడు. ఆ తర్వాత అభిమానులతో భేటీ అయిన విజయ్ మరోసారి కరాఖండిగా తండ్రి పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన తండ్రి పార్టీకి అభిమానులెవరూ మద్దతు తెలపవద్దంటూ సూచించారు. అభిమాన సంఘంలో ఉండి రాజకీయ పార్టీతో సంబంధం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దంటూ హెచ్చరించారు.

అభిమాన సంఘం నుంచి పలువురి తొలగింపు..

విజయ్ అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ నుంచి కొందరు చంద్ర‌శేఖర్‌కు మద్దతుదారులు, సానుభూతి పరులు ఉండటంతో వారిని అభిమాన సంఘం నుంచి తొలగిస్తున్నట్లు విజయ్ నిర్ణయం తీసుకున్నారు. వారికి అభిమాన సంఘానికి ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పారు. ఇలా విజయ్ తన తండ్రి చంద్రశేఖర్ విషయంలో మరింత మొండిగా వ్యవహరిస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది. విజయ్ రాజకీయాల్లోకి రావాలనేది చంద్రశేఖర్ కోరిక. కానీ, విజయ్ మాత్రం ఇది సరైన సమయం కాదంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ తండ్రి చంద్రశేఖర్ పార్టీని ప్రకటించాడు. మరి వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచి సత్తా చాటేనా అనేది తెలియాలంటే అప్పటి దాకా వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News