తలైవా షూటింగ్ షురూ..!
సూపర్‌స్టార్ రజినీకాంత్ మూవీస్, పర్సనల్ లైఫ్, పాలిటిక్స్‌కు సంబంధించి.. ఏ విషయమైనా అభిమానులకు పండగ వార్తే. తలైవా సినిమా వస్తుందంటే చాలు.. తమిళనాట మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే, తాజాగా రజినీ మూవీ అప్‌డేట్స్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రజినీ.. హీరో అజిత్‌కు వరుస హిట్లిచ్చిన శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తె’ మూవీలో నటిస్తున్నారు. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తుండగా, ఇది రజినీ […]
సూపర్‌స్టార్ రజినీకాంత్ మూవీస్, పర్సనల్ లైఫ్, పాలిటిక్స్‌కు సంబంధించి.. ఏ విషయమైనా అభిమానులకు పండగ వార్తే. తలైవా సినిమా వస్తుందంటే చాలు.. తమిళనాట మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల్లో క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే, తాజాగా రజినీ మూవీ అప్‌డేట్స్ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రస్తుతం రజినీ.. హీరో అజిత్‌కు వరుస హిట్లిచ్చిన శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తె’ మూవీలో నటిస్తున్నారు. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేశ్ ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తుండగా, ఇది రజినీ మార్క్ యాక్షన్ చిత్రంలా కాకుండా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా మూవీ షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ ఆగిపోగా, లాక్‌డౌన్‌కు ముందే ‘అన్నాత్తె’ షూటింగ్ పూణేలో కొంతభాగం జరిగింది. ఈ సమయంలో మళ్లీ అక్కడికెళ్లి (పూణే) షూటింగ్ చేయడం అసాధ్యం కాబట్టి.. చెన్నైలోని స్టూడియోలో పూణే వాతావరణాన్ని ప్రతిబించేలా కోట్లాది రూపాయల ఖర్చుతో సెట్స్ వేయడానికి నిర్ణయించినట్టుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఆ సెట్స్‌లోనే పూణే షూటింగ్ పార్ట్‌ను కానిచ్చేస్తారని సమాచారం.