వారానికి రెండు, మూడు రోజులు ఏంటి?

దిశ, అమరావతి: ఓ వైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే వారానికి రెండు, మూడు రోజులు పాఠశాలలు పెట్టడం ఏంటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుంకర పద్మశ్రీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. పిల్లల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారని, కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని […]

Update: 2020-07-06 05:45 GMT

దిశ, అమరావతి: ఓ వైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే వారానికి రెండు, మూడు రోజులు పాఠశాలలు పెట్టడం ఏంటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుంకర పద్మశ్రీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. పిల్లల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారని, కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News