ఈ రాశి వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : దక్షిణాయణం మాసం : శ్రావణమాసం ఋతువు : వర్ష ఋతువు వారము : ఆదివారం పక్షం : శుక్లపక్షం తిథి : సప్తమి (నిన్న ఉదయం 11 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 51 ని॥ వరకు) నక్షత్రం : స్వాతి (నిన్న ఉదయం 6 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ […]

Update: 2021-08-14 11:42 GMT

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : శ్రావణమాసం
ఋతువు : వర్ష ఋతువు
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి (నిన్న ఉదయం 11 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 51 ని॥ వరకు)
నక్షత్రం : స్వాతి (నిన్న ఉదయం 6 గం॥ 57 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 44 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : వణిజ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : ఈరోజు అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 0 ని॥ నుంచి 5 గం॥ 50 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 6 ని॥ నుంచి 6 గం॥ 41 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 30 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 5 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 19 ని॥ నుంచి 1 గం॥ 54 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 58 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 42 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : తుల
విశేషం : 15. స్వాతంత్రదినోత్సవం

మేష రాశి : మీ ఆత్మవిశ్వాసం అంబరాన్ని అంటుతుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న కార్యాలను సులభంగా సాధిస్తారు. మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. ఆఫీస్ పనులను సరైన ప్రణాళికతో సకాలంలో పూర్తి చేస్తారు. కొంతమందికి ప్రమోషన్. వివాదాస్పద విషయాల జోలికి వెళ్లి వాదోపవాదాలు చేయకండి. వ్యాపారస్తులు తమ భాగస్వామ్య వ్యాపారం విస్తరణకు సరైన అవకాశం. ఆదాయం బాగుంది. ఇల్లు కట్టుబడి పూర్తి చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఇది ఒక తీపి గుర్తు.

వృషభ రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. దైవప్రార్థన వలన మానసిక ప్రశాంతత. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మీ తల్లిదండ్రుల దీవెనలు తీసుకోండి. ఇతరుల మీద అజమాయిషీ చలాయించడం మానేయండి. ఆదాయం బాగుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు.వ్యాపారస్తులు తమ భాగస్వామ్య వ్యాపారం విస్తరణకు సరైన అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం తెలుసుకోండి అదే మీ వైవాహిక జీవితానికి పునాది.

మిధున రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే ధైర్యం పట్టుదల అవసరం. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారితో పరుషంగా మాట్లాడకండి. వారితో వాదోపవాదాలకు దిగితే వారు హర్ట్ అయ్యే అవకాశం. ఆఫీసు పనులను శ్రద్ధ పెట్టి పూర్తి చేయండి. కొంతమందికి విదేశీ ప్రయాణ అవకాశం. కొంతమందికి ఆఫీస్ టూర్స్. అనుకోని ఖర్చులు వలన డబ్బుకి ఇబ్బంది. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి అదే మీ వైవాహిక జీవితానికి పునాది.

కర్కాటక రాశి : అనుకున్న కార్యాలను సాధించాలంటే ధైర్యము సరైన ప్రణాళిక అవసరం. మీరు ఆంజనేయుడు లాంటి వారు మీ శక్తిసామర్థ్యాలు తెలుసుకోండి. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి ఆదాయం బాగుంది ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. దైవప్రార్థన వలన మానసిక బలం. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడి వాదోపవాదాలకు దిగితే వారు హార్ట్ అయ్యే అవకాశం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపటం వలన ఎంతో ఆనందకరం.

సింహరాశి : ఆత్మవిశ్వాసము, తెలివైన నిర్ణయాలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దైవకార్యాలకు వలన మానసిక ప్రశాంతత ఇతరులతో వాదోపవాదాలకు దిగి సమయాన్ని వృధా చేసుకోకండి మీ విలువను మీరు తగ్గించుకో కండి. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. మీ పని నిబద్దత వలన ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు

కన్య రాశి : అనుకున్న కార్యాన్ని సాధించాలంటే మరింత కష్టపడాలి. ధైర్యం కోల్పోకండి. పెదవి మీద చిరునవ్వు ను వదిలి వేయకండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. సమస్యలను మొగ్గలోనే తుంచి వేయండి వాటిని పెంచకండి. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీ తల్లి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీ సహోదరులకు సహాయం చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం మాని వేయండి.

తులారాశి : ఆత్మ న్యూనత భావం వదిలివేయండి. ధైర్యం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. తోడబుట్టిన వారికి ధన సహాయం చేస్తారు. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి దైవప్రార్థన వలన మానసిక బలం. ఆఫీసు పని మీద శ్రద్ధ పెట్టి సకాలంలో పనులు పూర్తి చేయండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత గొడవలు మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు గడపండి.

వృశ్చిక రాశి : గందరగోళం వదిలేయండి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. మానవసేవే మాధవసేవ ఇతరులకు సహాయం చేయండి దాని ద్వారా మానసిక ప్రశాంతత. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతల వలన అధిక శ్రమ. పనులు పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఆదాయం పరవాలేదు దుబారా ఖర్చులను నివారించండి. అధిక శ్రమ వలన భుజాల నొప్పులు. ఎలర్జీ వలన చర్మ సంబంధ వ్యాధులు. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకొని మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

ధనుస్సు రాశి : మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. ఆధ్యాత్మిక మార్గం మీద ఆసక్తి కనబరుస్తారు. సహనంతో వ్యవహరించండి. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవ్వాలని ఆలోచనతో అడ్డదారులు తొక్క కండి. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి వారు హర్ట్ అవుతారు. వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు వారి శ్రమకు తగిన ఫలితం. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు కుటుంబ విషయాల గురించి చర్చించుకుంటారు ఆనందంగా గడుపుతారు.

మకర రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసము పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. సహనంతో వ్యవహరించాలి ఇతరులు చెప్పేది వినండి. తోడబుట్టిన వారికి ధన సహాయం చేస్తారు. మీ పిల్లల చదువు లను గమనించండి వారు ఆటలపై దృష్టిపెట్టి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు ఆఫీసులో మీ పని నిబద్ధత పై అందరి ప్రశంసలు. ఆఫీస్ పనులను మీ సామర్థ్యం ఉపయోగించి సకాలంలో పూర్తి చేస్తారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

కుంభరాశి : భవిష్యత్ గురించి చింతించకండి వర్తమానాన్ని ఆస్వాదించండి. దైవ ప్రార్ధన మెడిటేషన్ మంచి ఉపాయాలు ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి మీ తండ్రిగారి సలహాలు తీసుకోండి. వ్యాపారస్తులు తమ భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించండి. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. బయట భోజనం వల్ల అజీర్తి ఈ ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి ఏకాంతంగా ఆనందంగా గడపాలని కోరుకుంటారు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

మీన రాశి : ఈరోజు సహనంతో వ్యవహరించాలి. ఇతరులతో వాదోపవాదాలు దిగడం వలన సమయం వృధా. మీ మూర్ఖపు పట్టుదల వలన ఇబ్బందులు కలగవచ్చు. పనులు అనుకున్న విధంగా సాగక పోవటం వలన మానసిక అశాంతి మెడిటేషన్ దైవ ప్రార్థన మంచి ఉపాయాలు. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆఫీసు పనులను శ్రద్ధపెట్టి సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

Tags:    

Similar News