ఆదివారం సాయంత్రం ప్రచారానికి తెర
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ మహాపోరులో ప్రధాన ఘట్టానికి ఆదివారంతో తెర పడుతోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఈ నెల 29న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గ్రేటర్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించని రాజకీపార్టీల నాయకులు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారధి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్ మహాపోరులో ప్రధాన ఘట్టానికి ఆదివారంతో తెర పడుతోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఈ నెల 29న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. గ్రేటర్ పరిధిలో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించని రాజకీపార్టీల నాయకులు, అభ్యర్ధుల, ప్రచార నిర్వాహకులపై చర్యలు తప్పవని ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారధి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్, 1955 ప్రకారం రెండు సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు.