కరోనా నివారణ కోసం సన్‌ఫార్మా సాయం!
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రానికి బాసటగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అయిన సన్‌ఫార్మా తొలి అడుగు వేసింది. సుమారు రూ. 25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్వీన్ సహా పలు రకాల మందులు, శానిటైజర్లను విరాళంగా అందించనున్నట్టు ప్రకటించింది. కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి సహాయంగా కలిసి పనిచేస్తామని సంస్థ వెల్లడించింది. వైరస్‌తో ఇబ్బందులు పడుతున్న అందరికోసం ఆటంకం లేకుండా […]
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రానికి బాసటగా ప్రముఖ ఔషధ తయారీ సంస్థ అయిన సన్‌ఫార్మా తొలి అడుగు వేసింది. సుమారు రూ. 25 కోట్ల విలువైన హైడ్రాక్సీ క్లోరోక్వీన్ సహా పలు రకాల మందులు, శానిటైజర్లను విరాళంగా అందించనున్నట్టు ప్రకటించింది. కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి సహాయంగా కలిసి పనిచేస్తామని సంస్థ వెల్లడించింది. వైరస్‌తో ఇబ్బందులు పడుతున్న అందరికోసం ఆటంకం లేకుండా మందులు అందేలా అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నట్టు సంస్థ తెలిపింది. దీనికోసం ప్రత్యేకంగా టీమ్‌ని కూడా సిద్ధం చేసినట్టు వెల్లడించింది. అలాగే, కరోనాతో పోరులో పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్న వైద్య సిబ్బిందిని సన్‌ఫార్మా కృతజ్ఞతగా నాణ్యమైన శానిటైజర్లు తయారు చేస్తున్నట్టు వివరించారు. ఇండియాలో ఒక కేంద్రాన్ని దీనికోసమే ప్రత్యేకంగా కేటాయించినట్టు తెలుస్తోంది. కరోనాను నివారించేందుకు గాను తమ ఉద్యోగుల్లో కొంతమందిని వర్క్ ఫ్రమ్ హోమ్ చెసేలా ఆదేశించినట్టు స్పష్టం చేసింది.
Tags : Coronavirus, COVID-19, Sun Pharma, Sun Pharmaceuticals, India