సీఎం జగన్‌కు చుక్కెదురు.. అక్రమాస్తుల కేసులో సమన్లు
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి షాక్ తగిలింది. సీబీఐ, ఈడీ కోర్టులు సమన్లు జారీ చేశాయి. వాన్ పిక్ ఈడీ కేసును కోర్టులు విచారణకు స్వీకరించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ కోర్టులు వేర్వేరుగా సమన్లు జారీ చేశాయి. సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్‌కు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్‌తో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి షాక్ తగిలింది. సీబీఐ, ఈడీ కోర్టులు సమన్లు జారీ చేశాయి. వాన్ పిక్ ఈడీ కేసును కోర్టులు విచారణకు స్వీకరించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ కోర్టులు వేర్వేరుగా సమన్లు జారీ చేశాయి. సెప్టెంబర్ 22న విచారణకు హాజరు కావాలని సీఎం జగన్‌కు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్‌తో పాటు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట రమణ, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రకాష్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సామ్యూల్, మన్మోహన్‌సింగ్‌లతో పాటు జగతి పబ్లికేషన్స్‌కు సీబీఐ, ఈడీ కోర్టులు సమన్లు జారీ చేశాయి.
ఇకపోతే సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కోర్టులో మంగళవారం మరో రెండు చార్జిషీట్లు దాఖలైన సంగతి తెలిసిందే. వాన్ పిక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసుల్లో ఈ చార్జిషీట్లు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీట్ల ఆధారంగా ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ అభియోగాలతో చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ చార్జిషీట్లపై సీబీఐ, ఈడీ కోర్టులు విచారణకు స్వీకరించింది.