కేసీఆర్ చేతగాని తనంతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ చేతగాని తనంతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ధ్వజమెత్తారు. 2 నెలల్లో 245 మంది ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వ వైఖరీయే కారణమన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సేద్యంలో అధిక దిగుబడి గొప్పలు చెప్పిన కేసీఆర్… ఇప్పుడు యాసంగిలో గింజకూడా కొనబోమని చెప్పడం ఎవరి చేతగానితనం అని ప్రశ్నించారు. కొనుగోలు బాధ్యత కేంద్రానిదా? రాష్ట్రానిదా? ఇద్దరిదీ కాదా? […]
దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్ చేతగాని తనంతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ధ్వజమెత్తారు. 2 నెలల్లో 245 మంది ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వ వైఖరీయే కారణమన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సేద్యంలో అధిక దిగుబడి గొప్పలు చెప్పిన కేసీఆర్… ఇప్పుడు యాసంగిలో గింజకూడా కొనబోమని చెప్పడం ఎవరి చేతగానితనం అని ప్రశ్నించారు.
కొనుగోలు బాధ్యత కేంద్రానిదా? రాష్ట్రానిదా? ఇద్దరిదీ కాదా? ఏదో ఒకటి రైతాంగానికి తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యామ్నాయ పంటల విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో తెలుగుమహిళా రాష్ట్ర ప్రధానకార్యదర్శి సూర్యదేవరలత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముంజా వెంకటరాజంగౌడ్, మీడియా కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.