బిగ్ బ్రేకింగ్ : ఆఫ్ఘన్‌లో మరో పేలుడు

దిశ, వెబ్‌డెస్క్ : తాలిబన్ల ఆక్రమణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సాధారణ ప్రజలు, భద్రతా బలగాలే లక్ష్యంగా పేలుళ్ళకు పాల్పడుతున్నారు. తాజాగా కాబూల్‌లోని ఎయిర్‌పోర్టు లక్ష్యంగా మరో పేలుడు సంభవించింది. అమెరికా బలగాలే లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు రాకెట్ లాంచర్ ప్రయోగించగా.. గురితప్పి అది జనావాసాల మధ్య పడినట్టు సమాచారం. అమెరికన్ ఎంబస్సీ అతి తగ్గరలో ఈ పేలుడు సంభవించగా 10 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 50మందికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. […]

Update: 2021-08-29 07:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తాలిబన్ల ఆక్రమణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. సాధారణ ప్రజలు, భద్రతా బలగాలే లక్ష్యంగా పేలుళ్ళకు పాల్పడుతున్నారు. తాజాగా కాబూల్‌లోని ఎయిర్‌పోర్టు లక్ష్యంగా మరో పేలుడు సంభవించింది. అమెరికా బలగాలే లక్ష్యంగా ఐసిస్ ఉగ్రవాదులు రాకెట్ లాంచర్ ప్రయోగించగా.. గురితప్పి అది జనావాసాల మధ్య పడినట్టు సమాచారం. అమెరికన్ ఎంబస్సీ అతి తగ్గరలో ఈ పేలుడు సంభవించగా 10 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 50మందికి తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్టు సమాచారం. దీంతో అమెరికా వెంటనే ఆర్మీ రంగంలోకిి దిగింది. నాలుగు ఫైటర్ జెట్లు కాబూల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయినట్టు సమాచారం. ఇదిలాఉండగా, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఆఫ్ఘన్‌లో బాంబు దాడులు మరిన్ని చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరించిన కొన్ని గంటల్లోనే మరో పేలుడు చోటుచేసుకోవడం గమనార్హం.

కాబూల్‌లో ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన పేలుడు ఇది రెండోది. కాగా, ఈనెల 22న జరిగిన దాడిలో మొత్తంగా 183 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అందులో 13 మంది అమెరికన్ జవాన్లు ఉన్నారు. అయితే, ఆ దాడి తామే జరిపినట్టు ISIS-K ప్రకటించుకుంది. తమ దేశ జవాన్లు మరణానికి బదులుతీర్చుకుంటామని ప్రకటించిన అమెరికా మరుసటి రోజు డ్రోన్ దాడుల ద్వారా ఐసిస్ కీలక నాయకున్ని అంతమొందించినట్టు అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News