సీఎం ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ సీఎం అధికారిక నివాసం ముందు ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. సినిమా తీస్తానంటూ సీఎంను కలవడానికి వచ్చిన యువకుడిని.. సిబ్బంది అడ్డుకోవడంతో పొట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను ఆర్పేసి.. అతడిని స్థానిక అంబేద్కర్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆ యువకుడి శారీరం 50 శాతం కాలిపోయినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు దంతరీ ప్రాంతానికి చెందిన హర్ దేవ్ గా […]

Update: 2020-06-29 09:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ సీఎం అధికారిక నివాసం ముందు ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. సినిమా తీస్తానంటూ సీఎంను కలవడానికి వచ్చిన యువకుడిని.. సిబ్బంది అడ్డుకోవడంతో పొట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను ఆర్పేసి.. అతడిని స్థానిక అంబేద్కర్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆ యువకుడి శారీరం 50 శాతం కాలిపోయినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు యత్నించిన యువకుడు దంతరీ ప్రాంతానికి చెందిన హర్ దేవ్ గా గుర్తించారు. కాగా, అతడికి మతిస్థిమితం సరిగ్గా లేనట్లు సమాచారం.

Tags:    

Similar News