ఆత్మసంతృప్తి లేని ‘కళాకారుడు’

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఆత్మసంతృప్తి లేకుండా చేసే పని ఆత్మహత్యతో సమానం’ అనే అమేజింగ్ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ ‘కళాకారుడు’. కలర్ ఫొటో ఫేమ్ సుహాస్ నటించిన ఈ లఘు చిత్రాన్ని ప్రభల తిలక్ డైరెక్ట్ చేశారు. తొమ్మిది నిమిషాల 45 సెకన్ల నిడివితో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో సుహాస్ రంగస్థల కళాకారుడిగా కనిపించాడు. ‘సహదేవుడి మరణం’ అనే నాటకాన్ని వేసిన ఈ కళాకారుడు.. తన పని మీద తాను సంతృప్తి పొందడు. […]

Update: 2020-11-24 01:56 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘ఆత్మసంతృప్తి లేకుండా చేసే పని ఆత్మహత్యతో సమానం’ అనే అమేజింగ్ స్టోరీ లైన్‌తో తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ ‘కళాకారుడు’. కలర్ ఫొటో ఫేమ్ సుహాస్ నటించిన ఈ లఘు చిత్రాన్ని ప్రభల తిలక్ డైరెక్ట్ చేశారు. తొమ్మిది నిమిషాల 45 సెకన్ల నిడివితో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో సుహాస్ రంగస్థల కళాకారుడిగా కనిపించాడు. ‘సహదేవుడి మరణం’ అనే నాటకాన్ని వేసిన ఈ కళాకారుడు.. తన పని మీద తాను సంతృప్తి పొందడు. కానీ తను అద్భుతంగా నటించాడని అభిమానులు చప్పట్లు కొడతారు, ప్రశంసల వర్షం కురిపిస్తారు. కొందరు మేకప్ రూమ్‌కు వచ్చి మరీ, లక్షల్లో డబ్బులు సమర్పించుకుని తమ అభిమానాన్ని చాటుకుంటే.. మరికొందరు వేలల్లో సమర్పించుకుని తమ అభిమాన నటుడిని పొగడ్తల్లో ముంచెత్తుతారు. మరోసారి ఇదే నాటకాన్ని వేస్తే చూడాలని ఉందని కోరతారు.

Full View

కానీ కళాకారుడిగా తను ఇందుకు తగనని తెలిసిన నటుడు.. తన తప్పులు తనకు తెలిసిన నటుడు.. అభిమానుల కోరిక మేరకు మళ్లీ అదే నాటకాన్ని 39వ సారి ప్రదర్శిస్తాడా? లేదా ఆత్మసంతృప్తి లేని నాటకాన్ని కొనసాగించకుండా ఉంటాడా? డబ్బు కోసమే నాటకాన్ని మొదలు పెట్టిన తను.. అంత డబ్బు తనను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఎందుకు కాదనుకుంటున్నావ్! అన్న గురువు ప్రశ్నకు కళాకారుడు ఇచ్చే సమాధానం ఏంటి? అనేది చూసితీరాల్సిందే. రంగస్థల నటుల ఆత్మసంతృప్తిని ప్రదర్శించిన ఈ షార్ట్ ఫిల్మ్.. మనలో చాలా మందికి కనువిప్పు కలిగించేలా ఉంది. ఏదో దొరికింది కదా అని పని చేసుకుంటూ పోతే, సంతృప్తి లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది అన్న మెసేజ్‌తో మూడేళ్ల క్రితం రిలీజైన ఈ ‘కళాకారుడు’.. చూసిన ప్రతీసారి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనసును మెలిపెడుతుంది.

Tags:    

Similar News