సొంత పోస్టర్‌తో రాలేరా? ఏఎల్‌టి బాలాజీ, జీ5పై ఫిల్మ్ మేకర్ ఫైర్
దిశ, సినిమా: ఏఎల్‌టి బాలాజీ, జీ5 ప్రీమియం ‘హిజ్ స్టోరి’ అనే కొత్త సిరీస్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నెల 25న విడుదల కానున్న సిరీస్‌లో సత్యదీప్ మిశ్రా, ప్రియమణి, మృణాల్ దత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మ్యారేజ్ చేసుకుని ఫ్యామిలీ ఉన్న ఓ వ్యక్తి మరో అబ్బాయికి అట్రాక్ట్ అయినప్పుడు ఎదురయ్యే పరిస్థితులను సిరీస్‌లో చూపించబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలో శనివారం పోస్టర్, ట్రైలర్ రిలీజ్ చేయగా అవి ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ పోస్టర్ 2015లో వచ్చిన ‘లోవ్’ […]
దిశ, సినిమా: ఏఎల్‌టి బాలాజీ, జీ5 ప్రీమియం ‘హిజ్ స్టోరి’ అనే కొత్త సిరీస్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నెల 25న విడుదల కానున్న సిరీస్‌లో సత్యదీప్ మిశ్రా, ప్రియమణి, మృణాల్ దత్ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మ్యారేజ్ చేసుకుని ఫ్యామిలీ ఉన్న ఓ వ్యక్తి మరో అబ్బాయికి అట్రాక్ట్ అయినప్పుడు ఎదురయ్యే పరిస్థితులను సిరీస్‌లో చూపించబోతున్నారు మేకర్స్. ఈ క్రమంలో శనివారం పోస్టర్, ట్రైలర్ రిలీజ్ చేయగా అవి ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ పోస్టర్ 2015లో వచ్చిన ‘లోవ్’ మూవీ పోస్టర్‌ను పోలి ఉందని, తమ కష్టాన్ని నిర్మొహమాటంగా కాపీ చేశారని ఆరోపించారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ సుధాన్షు సరియా.
ఏఎల్‌టి బాలాజీ, జీ5 ప్రీమియంకు చెందిన మేధావులు తమ ఒరిజినల్ పోస్టర్‌ను ఎలాంటి డీసెన్సీ లేకుండా వాడుకున్నారని ఫైర్ అయ్యారు. తమ పోస్టర్‌ను ఇష్టపడటం సంతోషం.. వెరైటీ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు హ్యాపీ.. కానీ ఇలా చేయాల్సిన అవసరం ఏంటి? అని ప్రశ్నించారు సుధాన్షు. మోస్ట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పుకుంటున్న ఏఎల్‌టి బాలాజీ, జీ5 తమ సొంత పోస్టర్‌తో రాలేరా? అని మండిపడ్డారు. దీనిపై స్పందించిన ఏఎల్‌టి బాలాజీ స్పోక్స్ పర్సన్ తమ టీమ్ ఏ ఆర్టిస్ట్ క్రియేటివిటీని దోచుకోదని స్పష్టం చేశారు. ఎప్పటికీ అలా చేయలేమని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా మరో కళాకారుడి ప్రతిభను దోచుకోబోమని, తమ పోస్టర్‌పై వర్క్ చేసేందుకు మల్టిపుల్ క్రియేటివ్ పార్ట్‌నర్స్ ఉన్నారని క్లారిటీ ఇచ్చారు.